నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డికి హైకోర్టులో ఊరట

నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.

ఎన్నిక వివాదంపై ఆయన తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపిస్తూ నాగం జనార్థన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.

అయితే 2018 వ సంవత్సరంలో నాగంపై మర్రి జనార్థన్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మర్రి జనార్థన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ 2019లో నాగం జనార్థన్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఇందులో భాగంగా అఫిడవిట్ లో వివరాలు దాచి పెట్టారని ఆరోపించిన ఆయన మర్రి జనార్ధన్ రెడ్డి ఎన్నిక రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం తగిన ఆధారాలు లేకపోవడంతో పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

వైరల్ వీడియో: అరె ఏంట్రా ఇది.. పళ్లతో అంత బరువుని ఎలా ఎత్తేశావ్?