హిమాచల్ ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సిమ్లాలోని కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో శివాలయం కుప్పకూలింది.
సమ్మర్ హిల్ ప్రాంతంలో ఉన్న శివాలయం కూలడంతో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారని తెలుస్తోంది.మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు.మరోవైపు ఘటనపై సీఎం సుఖ్వీందర్ సింగ్ సిఖు విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.