1998 లో విడుదలైన జీన్స్ (Jeans) సినిమా అప్పటి ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సినిమా పేరు చెప్తే ఇప్పటికి కూడా చాలామంది అభిమానులు ఆ సినిమా ఎంత బాగుందో అంటూ పొగుడుతూ ఉంటారు.
శంకర్ దర్శకత్వంలో ప్రశాంత్,ఐశ్వర్య రాయ్ ( Aishwarya rai ) హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.ఇక ఈ సినిమాతో ప్రశాంత్ కెరీర్ ఒక్కసారిగా టాప్ రేంజ్ కి వెళ్ళింది.
అప్పటి హీరోలైన అజిత్, విజయ్ లకి పోటీగా ఈయనకి అభిమానులు ఉండేవారు.కానీ అలాంటి ప్రశాంత్ ( Prashanth ) సినీ కెరియర్ ఇప్పుడు ఏమాత్రం ఆశాజనకంగా లేదు.
విజయ్, అజిత్ (Ajith) లు ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటే ప్రశాంత్ కి మాత్రం సినిమా అవకాశాలు లేవు.ఇక ప్రశాంత్ సినీ కెరియర్ ఇలా నాశనం అవ్వడానికి కారణం ఆయన భార్య అని చెప్పుకుంటారు చాలామంది ఇండస్ట్రీలోని ఆయన సన్నిహితులు.అయితే ప్రశాంత్ సినీ కెరీర్ ఎలా నాశనం అయ్యింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.ప్రశాంత్ గృహలక్ష్మి అనే అమ్మాయిని 2009లో పెళ్లి చేసుకున్నారు.ఇక పెళ్ళయ్యాక వీరికి ఒక బాబు పుట్టాడు.
కానీ బాబు పుట్టాక వీరి మధ్య మనస్పర్ధలు వచ్చి గృహలక్ష్మి ( Gruhalakshmi ) మరోసారి ప్రెగ్నెంట్ గా ఉండగానే తల్లిదండ్రుల దగ్గరికి కొడుకుని తీసుకొని వెళ్లి పోయింది.
అక్కడికి వెళ్లాక గృహలక్ష్మికి పాప పుట్టింది.కానీ పాపని చూడడానికి కూడా ప్రశాంత్ ని రానివ్వలేదు.అలా వీరి మధ్య గొడవలు జరుగుతున్న వేళ నా భార్య నాకు కావాలి అని ప్రశాంత్ చెప్పారు.ఇక అప్పుడే ఎంటర్ అయ్యారు నారాయణన్ ( Narayanan ) అనే వ్యక్తి.
ఇక ఆ వ్యక్తి ఒక సంచలన విషయాన్ని బయట పెట్టారు.
గృహలక్ష్మిని నేను ముందుగా పెళ్లి చేసుకున్నానని, మా పెళ్లి 1998 లోనే జరిగిందని,నీకంటే ముందు నేనే తాళి కట్టాను అంటూ వాదించాడు.
దాంతో తన భార్య నిజస్వరూపం బయటపడి ప్రశాంత్ ( Prashanth ) భార్యతో విడిపోవడానికి కోర్టులో విడాకులు అప్లై చేశారు.ఇక వీరికి విడాకులు వచ్చాక తన కొడుకుని తన దగ్గరే ఉండాలని కోర్టును తీర్పు ఇవ్వమనగా కోర్టు ఆయన మాటల్ని కొట్టి పారేసింది.
తల్లి దగ్గరే ఉండాలి అని తీర్పు ఇచ్చింది.ఇలా జీవితంలో ఈయనకి ఉన్న ఒడిదడుకుల వల్ల చాలా డిప్రెషన్ లోకి వెళ్లారు.అంతేకాకుండా ఈయన పరువు మొత్తం పోయేసరికి ఇండస్ట్రీలో ఏ దర్శకనిర్మాత కూడా అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రాలేదు.దాంతో ఈయన చాలా రోజులు ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది.
ఇక వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ ( Ram charan ) కి అన్నయ్యగా కలెక్టర్ ఆఫీసర్ పాత్రలో నటించారు.