కోలీవుడ్( Kollywood) ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ శంకర్ ( Director shankar )గురించి చెప్పాల్సిన పని లేదు ఈయన సినిమాలు అంటే పక్క బ్లాక్ బాస్టర్ అవుతాయన్న మార్క్ ఈయన పై ఉంది.ఇలా దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శంకర్ తన కుమార్తెను హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
నిజానికి తన కుమార్తె అదితి శంకర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రావడం శంకర్ కి ఏమాత్రం ఇష్టం లేకపోయిన కొన్ని కండిషన్ల మీదే హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

శంకర్ కుమార్తెగా అదితి శంకర్ హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చారు.అయితే ఇప్పటివరకు రెండు సినిమాలలో మాత్రమే నటించారు.అయితే ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి.
ఈ క్రమంలోనే మరో మూడు సినిమాల షూటింగ్ పనులలో అదితి శంకర్ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో దూకుడు కనబరుస్తున్నటువంటి అతిథి శంకర్( Aditi shankar ) కొద్ది రోజులు మాత్రమే ఇండస్ట్రీలో కనబడతారని తెలుస్తోంది.ఈమెను ఇండస్ట్రీకి పంపించడం ఇష్టం లేనటువంటి తన తండ్రి శంకర్ ఈమె రెండు సంవత్సరాలు మాత్రమే

అదితి శంకర్ ఎంబిబిఎస్ పూర్తి చేశారు.అయితే ఈమెనూ డాక్టర్ గా చూడాలన్నదే తన తల్లిదండ్రుల కోరిక కానీ ఈమెకు సినిమాలపై ఉన్న ఆసక్తితో సినిమాలలోకి వస్తానని పట్టు పట్టడంతో కాదన లేనటువంటి శంకర్ రెండు సంవత్సరాలు మాత్రమే హీరోయిన్గా ఉండాలని అనంతరం తాను పెళ్లి చేసుకోనేలాగా ఉంటేనే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలని కండిషన్ పెట్టారట అయితే ఈ కండిషన్లకు ఒప్పుకున్నటువంటి అతిథి శంకర్ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా పరిచయమయ్యారు.అందుకే ఈ రెండు సంవత్సరాల కాలంలో తనకు వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకోవాలని ఈమె భావించారని తెలుస్తుంది.ఇలా రెండు సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి.
మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.