24గంటలు గడవక ముందే ప్రమాదకర రోడ్డును పూడ్చివేశాము - ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్

ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో సుమారు గత 15 రోజుల క్రితం ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఎల్లారెడ్డిపేట లోని తిమ్మస్ కుంట కు గండి పడి అట్టి వరద నీరు రెండవ బై పాస్ రోడ్డు మీదకు వచ్చి ఒక పక్క రోడ్డు కోతకు గురైంది.కాగ గత రెండు రోజుల క్రితం ఇదే దారి వెంబడి ఒక ఆటో ప్రయాణికులతో వెళుతున్న సమయంలో రోడ్డు కిందకు దూసుకెళుతుండగ ఆటో డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.

 We Repaired The Damaged Road Before 24 Hours Oggu Rajitha Yadav, Repaired Damag-TeluguStop.com

ఇట్టి విషయం స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ దృష్టికి వెళ్లగా ఆమె మంగళవారం సాయంత్రం వర్షం నీటి ప్రవాహం కు కొట్టుకుపోయిన రెండవ బై పాస్ రోడ్డు ను ఆమె పరిశీలించారు.ఒకటి లేదా రెండు రోజుల్లో సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి దృష్టికి ఇట్టి సమస్యను తీసుకెళ్ళి పరిష్కరిస్తానని ఆమె అన్నారు.

ప్రమాదకరముగా మారిన రోడ్డున పూడ్చివేస్తామని హామీ ఇచ్చిన 24 గంటలు గడవక ముందే రోడ్డును సరిచేయించారు.కాగ బుదవారం ఉదయం ఎనిమిది గంటలకు జేసిబి యంత్ర సహాయంతో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తీసుకువచ్చి ప్రమాదకర గుంతను సర్పంచ్ వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు ఆమె పూడ్చి వేయించారు.

మట్టిని ట్రాక్టర్ల ద్వారా ప్రమాదకరంగా మారిన రోడ్డును మట్టితో పుడ్చివేయడానికి బీజేపి పట్టణ శాఖ అద్యక్షులు నేవూరి శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధి యూట్యూబ్ ఛానెల్ రిపోర్టర్ మారెపు భూశంకర్ స్వయంగా మట్టి ట్రాక్టర్లు నడిపారు.చెప్పిన మాటను చేసి చూపించిన ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ కు గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.

ఆమె వెంట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, వార్డు సభ్యులు జవ్వాజి లింగం, న్యాలకంటి దేవేందర్,బీజేపి పట్టణ శాఖ అద్యక్షులు నేవూరి శ్రీనివాస్ రెడ్డి,ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube