పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం లేదా.. అయితే బిడ్డ మెదడు ప్రమాదంలో ఉన్నట్లే..?

ప్రస్తుత కాలంలో మహిళలు అందం తగ్గిపోతుందని పిల్లలకు పాలు ఇవ్వడం లేదు.అలాంటి వారి పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 Not Giving Breast Milk To Children.. But The Child's Brain Is At Risk, Women, Br-TeluguStop.com

ఎందుకంటే తల్లిపాలు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి.ప్రతి ఒక్క బిడ్డకు ఆరు నెలలు వచ్చేవరకు తల్లిపాలు( Breast milk ) కచ్చితంగా ఇస్తూ ఉండాలి.

ఈ ఆరు నెలలు తల్లిపాలు తప్ప మరొకటి ఇవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు.తల్లిపాల గొప్పతనం గురించి పరిశోధనలలో మరో గొప్ప సంగతి బయటపడింది.

తల్లిపాలలో మేయో-ఇనాసిటోల్( Mayo-inasitol ) అనే చక్కెర ఎక్కువగా ఉంటుంది.

Telugu Breast Milk, Genetic, Tips, Mayo Inasitol-Telugu Health Tips

ఇది నవజాత శిశువుల మెదడు ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే పుట్టినప్పటి నుంచి మెదడులోని అనుసంధానాలు ఏర్పడుతూ ఉంటాయి.దానికి తోడు మెరుగుపడుతూ వస్తూ ఉంటాయి.

దీని వలన జన్యుపరమైన ( Genetic )అంశాలతో పాటు జీవితంలో ఎదురయ్యే ఎన్నో అనుభవాలుకు దారి చూపుతూ ఉంటాయి.శిశువుల్లో తల్లిపాలు ముఖ్యపాత్రను పోషిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంకా చెప్పాలంటే తల్లిపాలలో సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

Telugu Breast Milk, Genetic, Tips, Mayo Inasitol-Telugu Health Tips

శిశువులలో వివిధ దశలలో మెదడు ఎదుగుదలను బట్టి తల్లిపాలలోని పోషకాలు మారిపోతూ ఉంటాయి.శిశువుకి జన్మనిచ్చిన తర్వాత తొలి నెలలో తల్లిపాలలో పెద్ద మొత్తంలో మేయో-ఇనాసిటాల్ ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.అంటే శిష్యుల మెదడులో నాడీ అనుసంధానాలు చాలా వేగంగా ఏర్పడుతూ ఉంటాయి.

శిశువుల నాడుల మధ్య ఉన్న అనుసంధానల పరిమాణం పెరగడానికి దానికి తోడు వాటి సంఖ్య పెరగడానికి ఉపయోగపడుతుంది.శిశువు పుట్టిన తొలి రోజులలో రక్తంలోని హాని కలిగించేవి మెదడులోకి చేరకుండా అడ్డుకునే బ్యాక్టీరియా అంత సామర్థంగా పనిచేయదు.

దీనివల్ల శిశువు మెదడు ఆహారానికి చాలా తక్కువగా స్పందించవచ్చని శాస్త్రవేత్తలు ( Scientists )భావిస్తున్నారు.మొత్తానికి మెదడు సంపూర్ణ ఆరోగ్యానికి మంచి ఫలితాలు వస్తాయి.అంతేకాకుండా శాస్త్రవేత్తల పరిశోధనలతో మెరుగైన పాల పొడి తయారీకి ఈ అధ్యాయం మంచి ఫలితాలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube