టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో పవన్ సాధినేని ముందువరసలో ఉంటారు.తక్కువ సినిమాలే చేసినా ఆ సినిమాలు వేటికవే ప్రత్యేకంగా ఉండటంతో పాటు మినిమం గ్యారంటీ సినిమాలు, వెబ్ సిరీస్ లను తీస్తూ పవన్ సాధినేని( Pavan Sadineni ) అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.
దయా వెబ్ సిరీస్ తో ప్రశంసలు అందుకుంటున్న పవన్ సాధినేని ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
గతంలో కళ్యాణ్ రామ్( Kalyan Ram ) పవన్ సాధినేని కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రకటన వెలువడినా ఆ సినిమా షూటింగ్ జరుపుకోలేదు.గుణ్ణం గంగరాజుతో అసోసియేషన్ దొరకడం వరం అని పవన్ సాధినేని తెలిపారు.మనల్ని మనం కరెక్ట్ గా చేసుకునేలా ఆయన చేయగలరని పవన్ సాధినేని వెల్లడించారు.
ఆయనతో కలిసి అద్భుతమైన కథలు సిద్ధం చేశామని పవన్ చెప్పుకొచ్చారు.
సావిత్రి మూవీ తీసిన తర్వాత హరికృష్ణ కళ్యాణ్ రామ్ లతో ఒక సినిమాను ప్లాన్ చేశానని ఆ సమయంలోనే గంగరాజు గారు నాతో కలిశారని పవన్ సాధినేని పేర్కొన్నారు.
కళ్యాణ్ రామ్ హరికృష్ణ( Harikrishna ) కోసం అద్భుతమైన కథ సిద్ధం చేశామని ఫాంటసీ హిస్టారికల్ ఫిల్మ్ తీయాలని ప్లాన్ చేశామని పవన్ సాధినేని కామెంట్లు చేశారు.ఆ సినిమాలో ఒక పెద్ద హీరో గెస్ట్ రోల్ లో నటించడానికి అంగీకరించారని పవన్ సాధినేని చెప్పుకొచ్చారు.
ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల సమయంలో హరికృష్ణ గారు యాక్సిడెంట్ లో మృతి చెందారని ఆ కథను తీసుకుని పెద్ద హీరోలకు చెప్పగా కథ నచ్చినా నాపై నమ్మకం లేకపోవడం, ఇతర కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదని ఆయన అన్నారు.కళ్యాణ్ అన్నయ్య ఈరోజు కూడా ఛాన్స్ అడిగితే ఇస్తారని పవన్ సాధినేని పేర్కొన్నారు.హరికృష్ణ మరణం తర్వాత తారక్ ఇంటికి వెళితే నాకు మూవీ ఛాన్స్ మిస్ అయిందని జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కౌగిలించుకుని తన బాధను వ్యక్తం చేశారని పవన్ సాధినేని పేర్కొన్నారు.నాకు ఛాన్స్ మిస్ అయిందని జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారని పవన్ సాధినేని పరోక్షంగా చెప్పుకొచ్చారు.