టాంజానియా ఎన్నారైపై ఆ నటి అత్యాచార ఆరోపణలు.. నమోదైన కేస్!

ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్న టాంజానియన్‌ ఎన్నారైపై( Tanzanian NRI ) రేప్ కేస్ నమోదయింది.ఈ ఎన్నారై ఒక వ్యాపారవేత్త కాగా ఆయన పేరు విరాన్ పటేల్‌ (41).( Viran Patel ) రీసెంట్‌గా ఒక నటి, యాంకర్ తనపై విరాన్ పలు సందర్భాల్లో అత్యాచారం చేశాడని ఆరోపించారు.34 ఏళ్ల వయస్సు ఉన్న ఈ నటి తాను కొంతకాలంగా విరాన్ తో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, అతను తనకు ఇష్టం లేకపోయినా దాడి, అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

 Actress Filed A Case Of Molestation Against Nri Businessman In Mumbai Details, M-TeluguStop.com

ముంబై, అలీబాగ్, కర్జాత్, పూణేలోని పలు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగాయి.బాధితురాలు 2022 అక్టోబర్‌లో అంధేరీలో స్నేహితుడి పార్టీలో విరాన్‌ను కలుసుకుంది, ఆ తర్వాత అతను ఆమెను సంప్రదించడం ప్రారంభించాడు.

కొన్ని రోజులకే వారు క్లోజ్ అయ్యారు.అతను 2023, ఫిబ్రవరిలో ఆమెకు మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు.

ఆమె వెంటనే ఆ ప్రపోజల్‌కు అంగీకరించింది.ఆమె కుటుంబం, స్నేహితులకు సమాచారం ఇచ్చింది.

Telugu Abuse, Actress, Mumbai, Nm Joshi Marg, Nri Businessman, Relationship, Tan

అయితే, మార్చి 8న, అతను మద్యం తాగి ఇంటికి వచ్చి, ఆమె గదిలోకి ప్రవేశించి, ఆమె వద్దని చెప్పినా అత్యాచారం( Rape ) చేశాడు.మరుసటి రోజు ఉదయం, అతను తన కుటుంబ సభ్యులతో మాట్లాడి, డిసెంబర్‌లో ఆమెను వివాహం చేసుకుంటానని( Marriage ) చెప్పాడు.కానీ అతను తన వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా, ఆమెపై అనేక సందర్భాల్లో అత్యాచారం చేస్తూనే ఉన్నాడు.అసహజ శృంగార కార్యకలాపాలు కూడా చేయాలని బలవంతం చేశాడు.బాధితురాలు అతని లైంగిక హింస గురించి ఒకసారి పోలీసులకు సమాచారం అందించారు, కానీ ఆమె ఆ సమయంలో ఫిర్యాదు చేయలేదు, అతనికి పోలీసులు వార్నింగ్‌ ఇచ్చి వదిలేసారు.పెళ్లి సాకుతో తనను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వాడుకుంటున్నాడని ఆమె ఆరోపించారు.

Telugu Abuse, Actress, Mumbai, Nm Joshi Marg, Nri Businessman, Relationship, Tan

మోసం చేసినట్లు భావించి, అతను ఇతర మహిళలతో సంబంధం కలిగి ఉన్నాడని గ్రహించిన ఆమె అతనిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.N.M.జోషి మార్గ్ పోలీసులు అతనిపై అత్యాచారం, దాడి, దుర్వినియోగం వంటి వివిధ అభియోగాల కింద కేసు నమోదు చేశారు.ఫిర్యాదుదారు ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు.నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదు.కాగా నిందితుడు తన సంపదను, సంబంధాలను ఉపయోగించి దేశం నుంచి తప్పించుకుంటాడనే భయాన్ని బాధితురాలు వ్యక్తం చేస్తున్నారు.తనకు న్యాయం జరగాలని ఆశిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube