భారతదేశానికి రైతు వెన్నుముక లాంటివాడు, రైతే రాజు అనే మాటలు మనం చాలాసార్లు వినే ఉంటాం.ప్రస్తుతం భారతీయ మార్కెట్లో టమాటా రేటు( Tomato Prices ) ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే.
సామాన్య మధ్యతరగతి కుటుంబాలు టమాటలను కొనడమే మానేశాయి.అయితే గత కొన్ని సంవత్సరాలుగా టమాటా పంటను నమ్ముకుని సాగు చేస్తున్న రైతులు ( Farmers ) ప్రస్తుతం మంచి లాభాలను పొందుతున్నారు.
గతంలో ఒక రూపాయికి కిలో టమాటాలు విక్రయించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.కొన్నిసార్లు కూలీ డబ్బులు రాకపోతే రోడ్లపైనే టమాటాలు పారుపోసిన సంఘటనలు చాలానే ఉన్నాయి.అలా నష్టపోయిన రైతులు ఈ ఏడాది టమాటకు మంచి ధర ఉండడంతో అప్పులన్నీ తిరి మంచి లాభాలను పొందుతున్నారు.ఇక లక్షల్లో పెట్టుబడి పెట్టిన రైతులు కోటీశ్వరులు అవుతున్నారు.
ఈ క్రమంలోనే టమాటా పంటను సాగు చేసి లాభాలు పొందిన రైతు తన గొప్ప మనసు చాటుకున్నాడు.ఆ వివరాలు ఏమిటో చూద్దాం.
అన్నమయ్య జిల్లా( Annamayya District ) తంబళ్లపల్లి మండలంలో నరసింహారెడ్డి( Narasimha Reddy ) అనే రైతు తనకున్న 5 ఎకరాల పొలంలో టమాటా పంటను సాగు చేశాడు.ఈ ఏడాది మంచి దిగుబడి వచ్చింది.పైగా మార్కెట్లో టమాటా ధరకు రెక్కలు వచ్చాయి.ఇక ఆ రైతు లాభాలను చూసి ఆనందం పట్టలేకపోయాడు.తాను ఒక్కడే లాభాలు తినడం ఇష్టం లేక ఆ రైతు తన టమాటా పొలంలో పనిచేసిన కూలీలకు కొత్త బట్టలు పెట్టి తన మంచి మనసు చాటుకున్నాడు.
మహిళా కూలీలకు చీరలు, పురుషులకు కొత్త బట్టలు పెట్టి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.ఈ విషయం తెలిసిన గ్రామస్తులంతా ఆ రైతును ప్రశంసిస్తున్నారు.అందుకే రైతే రాజు అని పెద్దలు ఊరికే అంటారా.
ప్రస్తుతం ఎక్కడ చూసినా వర్షాలు అధికంగా ఉండడంతో కొద్దిపాటి టమాటా పంట మార్కెట్ వచ్చిన ఫుల్ డిమాండ్ పలుకుతోంది.హోల్ సేల్ మార్కెట్ లో రూ.100 నుంచి రూ.120 వరకు టమాటా ధర పలుకుతోంది.