ఎవరికి ఎప్పుడు అదృష్టం పట్టుకుంటుందో చెప్పడం చాలా కష్టం.ఇక సినిమా ఇండస్ట్రీ లో అయితే అది మరీ కష్టం.
ఎందుకంటే ఏ సినిమాతో ఎవరు ఓవర్ నైట్ లో స్టార్ హీరో హీరోయిన్స్ అయిపోతారో ఊహించడం కష్టం.ఇక ఈ మధ్యకాలం లో వచ్చిన చిన్న బడ్జెట్ సినిమాలు చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి.
అందులో ఈ మధ్యకాలం లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ సృష్టించిన బేబీ ( Baby ) మూవీ ఒకటి.ఇందులో ఇద్దరు హీరోలు ఇండస్ట్రీకి పరిచయమే ఉన్నప్పటికీ హీరోయిన్ మాత్రం ఒక యూట్యూబర్.
అలాంటి యూట్యూబర్ జీవితాన్నే మార్చేసింది బేబీ సినిమా.యూట్యూబ్ షార్ట్స్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేసుకుంటూ ఉండే వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaithanya ) కి బేబీ మూవీ అదృష్టాన్ని తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు.
ఈ సినిమాతో వైష్ణవి రేంజ్ ఎక్కడికో ఎగబాకింది.ముఖ్యంగా చెప్పాలంటే ప్రముఖ బ్యానర్ అయిన గీత ఆర్ట్స్ ( Geetha Arts ) లో కూడా ఈమెకు అవకాశం ఉంటుందని ఈ మధ్యకాలంలో వార్తలు వినిపిస్తున్నాయి.ఇదంతా పక్కన పెడితే.గతంలో ఓ ఇంటర్వ్యూలో మరో యూట్యూబర్ అయిన షణ్ముఖ్ జస్వంత్ ( Shanmukh Jashwanth ) తో వైష్ణవి చైతన్య పాల్గొంది.
అయితే ఆ ఇంటర్వ్యూలో యాంకర్ మీరు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు.
మీరు పెళ్లి చేసుకునే అబ్బాయి సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh babu ) లాంటి అందంతో ఉండాలా అని అడిగితే.నేను అలాంటి గొప్ప గొప్ప క్వాలిటీస్ ఏమీ కోరుకోను.కానీ నన్ను అర్థం చేసుకొనే మనస్తత్వం ఉంటే చాలు.
అలాంటి వాడినే నేను పెళ్లి చేసుకుంటా.అని వైష్ణవి చైతన్య వెల్లడించింది.
అయితే ఆ ఇంటర్వ్యూలో వైష్ణవి చైతన్య మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.