హీరోలు అవ్వాలంటే డాన్స్ అవసరం లేదు.. అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ), వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya ), విరాజ్ అశ్విన్( Viraj Ashwin ), ప్రధాన పాత్రల్లో వచ్చిన బేబీ సినిమా( Baby Movie ) ఈనెల 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఒక చిన్న సినిమాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది.

 You Don't Need To Dance To Become A Hero,anand Deverakonda,vaishnavi Chaitanya,d-TeluguStop.com

ఇప్పటివరకు ఈ సినిమా 45 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడంతో ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

Telugu Allu Arjun, Baby, Dance, Tollywood, Viraj Ashwin-Movie

ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ప్రత్యేకంగా అప్రిషియేషన్ ఈవెంట్ పేరుతో ఓ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.అయితే అంతకుముందు హీరో ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) మాట్లాడుతూ.నాకు మీలా డాన్స్ చేయడం రాదు మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాను అని తెలిపారు.ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Allu Arjun, Baby, Dance, Tollywood, Viraj Ashwin-Movie

ఆనంద్ మాట్లాడుతూ మీలాగా డాన్స్ (Dance) నేర్చుకుంటున్నానని చెప్పారు.అయితే హీరోలు కావాలి అంటే డాన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదని బన్నీ తెలిపారు.నాకు డాన్స్ వచ్చు కనుక నాలో ఉన్న టాలెంట్ బయట పెడుతున్నాను.

అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్ మీరు బయట పెట్టండి.హీరో అవ్వాలంటే డ్యాన్సులు, ఫైట్స్ అవసరం లేదు.

ఎవరి తీరు వాళ్ళది.మనం కష్టపడితే, మన ట్యాలెంట్ ఏంటో మన సినిమాకు తగ్గట్టు చూపిస్తే ఎవరైనా హీరోలు అవ్వచ్చు అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube