సమాజంలో ఒంటరిగా ఉండే మహిళలకు రోజురోజుకు రక్షణ కరువు అవుతోంది.గ్రామాలలో ఒంటరిగా తిరుగుతూ వస్తువులు అమ్ముకుంటున్నా ఓ బాలికపై ముగ్గురు కామాంధులు కన్నేశారు.
అవకాశం కోసం ఎదురుచూసి ముగ్గురు సామూహికంగా అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని మంత్రాలయంలో( Mantralayam ) చోటు చేసుకుంది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.
కర్నూల్ జిల్లా మంత్రాలయంలో బుడగజంగాల సామాజిక వర్గానికి చెందిన ఒక బాలిక( Girl ) వీధులలో తిరుగుతూ వస్తువులను అమ్ముకుంటు వుండేది.అయితే ఈ అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆ అమ్మాయిని సామూహిక హత్యాచారం చేయాలని, అవకాశం కోసం ఎదురు చూశారు.
ఆ అమ్మాయి ఒంటరిగా ఉండే సమయంలో ఆ ముగ్గురు దుర్మార్గులు దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ బాలిక ప్రాణాలతో ఉంటే తమకు ఎప్పుడైనా అపాయమే అని భావించిన దుర్మార్గులు అత్యంత దారుణంగా హత్య( Murder ) చేశారు.అనంతరం ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది అనే విధంగా ఒక చెట్టుకు మృతదేహాన్ని వేలాడదీశారు.బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తే, ఇది ఆత్మహత్య కాదు హత్య అని తేలింది.
ఆమెపై ముగ్గురు సామూహిక హత్యాచారానికి పాల్పడినట్లు తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.కేవలం ఒక్క రోజులోనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు పూర్తయ్యాక అన్ని వివరాలు తెలుపుతామని పోలీసులు తెలిపారు.ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా తీవ్ర కలకలం రేగింది.