మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన సినిమా( Uppena movie ) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కృతి శెట్టి( Kriti Shetty ).మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం మరో రెండు సినిమాల ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్నారు.
దీంతో ఈమెకు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రావడమే కాకుండా వరుసగా సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి.అయితే తాజాగా ఈమె నటించిన మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఈమె కెరియర్ కాస్త ఇబ్బందులలో పడిందని చెప్పాలి.
ఇకపోతే ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి కృతి శెట్టి గురించి గత కొంతకాలంగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో కుమారుడు తన వెంట పడుతూ తనని వేధింపులకు గురి చేస్తున్నారని తాను ఎక్కడికి వెళ్లినా తనని ప్రశాంతంగా ఉండనివ్వకుండా తనకు టార్చర్ చేస్తున్నారంటూ ఒక వార్త వైరల్ గా మారింది.అయితే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కృతి శెట్టి స్వయంగా వెల్లడించినట్లు ఈ వార్త సర్కులేట్ అవుతుంది.ఈ విధంగా కృతి శెట్టి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై ఈమె స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా కృతి శెట్టి స్పందిస్తూ నన్ను స్టార్ హీరో కుమారుడు వేధిస్తున్నాడని తాను ఎక్కడా చెప్పలేదని తెలిపారు.తాను ఇలాంటి వార్తలను అసలు నమ్మను కాకపోతే ఈ వార్త రోజుకు మరింత వైరల్ అవుతోంది.దయచేసి ఇలాంటి వాటిని నమ్మకండి అంటూ ఈమె స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఈ విధంగా కృతి శెట్టి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఇదంతా ఫేక్ న్యూస్ అని ఈ సందర్భంగా ఈమె కొట్టి పారేశారు.
ఇక కృతి శెట్టి సినిమాల విషయానికి వస్తే ఈమె నాగచైతన్య ( Nagachaitanya ) సరసన నటించిన కస్టడీ సినిమా ( Custody Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేక పోయిందని చెప్పాలి.