దివంగత సినీనటుడు రాజేష్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి బాలనటిగా అడుగుపెట్టారు నటి ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh ).నటుడు రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన రాంబంటు( Rambantu ) సినిమాలో బాలనటిగా నటించిన ఈమె అనంతరం కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఇలా ఈ సినిమా ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఐశ్వర్య రాజేష్ తెలుగు తమిళ భాషలలో వరుస సినిమా అవకాశాలను అందుకని బిజీగా ఉంటున్నారు.అయితే తెలుగుతో పోలిస్తే తమిళంలో ఈమె వరస అవకాశాలను అందుకుంటున్నారు.

ఇక తెలుగులో ఈ మధ్యకాలంలో ఈమెకు ఎలాంటి అవకాశాలు రాలేదని తెలుస్తోంది.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు తమ సినిమాలలో నటించడం కోసం నాకు ఎలాంటి అవకాశాలు( Chance ) ఇవ్వడం లేదని తెలిపారు.కొంతమంది హీరోలు అరుదుగా తనకు అవకాశం కల్పించిన స్టార్ హీరోలు మాత్రం తనకు తమ సినిమాలలో అవకాశాలు ఇవ్వలేదని తెలిపారు.

ఈ విధంగా స్టార్ హీరోల( Star heroes ) సినిమాలలో తనకు అవకాశాలు రాకపోవడంతో తన సినిమాలకు తానే హీరోగా ఉండాలన్న ఉద్దేశంతో హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే తాను నటిస్తున్నానంటూ ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె చివరిగా తమిళంలో నటించిన ఫర్హానా సినిమాలో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు.మరి ఈమె ఏ స్టార్ హీరోలను ఉద్దేశించి ఈ విధమైనటువంటి కామెంట్స్ చేశారో తెలియదు కానీ ప్రస్తుతం ఐశ్వర్య చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







