పోడు భూమి పట్టాలు పంపిణీ చేసిన మంత్రులు హరీష్ రావు, పువ్వాడ

పోడు రైతుల సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పోడు పట్టల పంపిణీ ని రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా పంపిణీ చేసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem )లోని పాల్వంచ సుగుణ ఫంక్షన్ హాల్ నందు అర్హులైన పోడు రైతులకు ఆయా పట్టాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ( Harish Rao ), రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్( Puvvada Ajay Kumar ) లాంఛనంగా పంపిణీ చేశారు.

తొలుత సభలో నిన్న అకాల మరణం చెందిన వేద సాయిచంద్ మృతికి నివాళిగా రెండు నిమిషాల పాటు సభ మౌనం పాటించింది.కొత్తగూడెంలో 4541 మందికి గాను 15311.27ఎకరాలు, భద్రాచలంలో 6,515 మందికి గాను 16211.02 ఎకరాలు, ఇల్లందులో 12,347 మందికి గాను 36,588.37 ఎకరాలు, పినపాకలో 15962 మందికి గాను 52,438.39 ఎకరాలు, అశ్వారావుపేటలో 9,418మందికి గాను 25,817.15 ఎకరాలు, వైరాలో 1,812 మందికి గాను 4,826.40 ఎకరాలు జిల్లాలో మొత్తం 50,595 మంది పోడు రైతులకు 1,51,195 ఎకరాలు పంపిణీ చేశారు.ఆయా పట్టాలు పొందిన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్, రైతు బందు పథకాలను వర్తింపజేస్తుందని ప్రకటించిన మంత్రులు.

స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు( Rega KanthaRao ), ఎమ్మెల్యేలు వనమా వెంటేశ్వరరావు, మెచ్చ నాగేశ్వర రావు, హరిప్రియ, జిల్లా కలెక్టర్ అనుదీప్, ITDA PO గౌతమ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

నేడు తెలంగాణకు మరోసారి ప్రధాని మోదీ..!!
Advertisement

Latest Bhadradri Kothagudem News