ఇటీవలే జూన్ 20న రామ్ చరణ్,( Ram Charan ) ఉపాసన( Upasana ) దంపతులకు పాప పుట్టిన విషయం తెలిసిందే.మెగా ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రజలు సైతం రామ్ చరణ్ దంపతులకు బిడ్డ పుట్టడంతో శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో మాములు సందడి చేయలేదు.
పెళ్ళై 10 ఏళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసనకు బిడ్డ పుట్టడంతో తాత నానమ్మ సంతోషం అంతా ఇంత కాదు.
మెగాస్టార్ ఎంత సంతోషంగా ఉన్నారో ఆయన చేసిన పోస్ట్ లోనే అర్ధం అవుతుంది.
ఇన్ని ఎదురు చూపుల మధ్య ఉపాసన దంపతులకు పండండి ఆడబిడ్డ పుట్టడంతో మెగా లిటిల్ ప్రిన్సెస్( Mega Little Princess ) రాకతో మెగా ఫ్యామిలీ ఫుల్ ఖుషీగా ఉంది.తమకు పాప పుట్టడంతో అభినందనలు చెబుతూ అభిమానులకు, తన శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు ఉపాసన, చరణ్ దంపతులు.
ఇక ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.మెగా ప్రిన్సెస్ కు ఊయల వేడుక గ్రాండ్ గా చేసేందుకు సన్నాహం చేస్తున్నారు.రేపు ఈ వేడుక గ్రాండ్ లెవల్లో నిర్వహించ బోతున్నారు అని తెలుస్తుంది.మరి ఇదే వేడుకలో పాప పేరు కూడా ప్రకటించ బోతున్నారు.ఇప్పటికే ఈ వేడుక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారని ఈ వేడుకకు సినీ సెలెబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉందట.
సినీ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న ప్రకారం మెగా కుటుంబంతో పాటు మెగాస్టార్, రామ్ చరణ్ అత్యంత సన్నిహితులు అలాగే స్నేహితులు, బంధువులు ఈ వేడుకకు హాజరు అవుతారట.ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అవ్వడంతో రేపటి వేడుకకు అంతా సిద్ధంగా ఉంది.మరి చూడాలి ఈ వేడుకలో అయిన మెగా ప్రిన్సెస్ ను రివీల్ చేస్తారో లేదంటే అలాగే గోప్యంగా ఉంచుతారో.
అంతేకాదు పాపకు ఎలాంటి పేరు పెడతారా అని కూడా అంతా ఎదురు చూస్తున్నారు.