ప్రపంచం టెక్నాలజీ( Technology ) విషయంలో రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతూ మనుషులు చేసే పనులు సులభతరం అవుతున్నాయి.ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.
గతంలో ప్రతి పనిని మనుషులే చేసేవారు.కానీ ప్రస్తుతం యంత్రాలు అందుబాటులోకి వచ్చాక ఎన్నో పనులు సులభంగా మారాయి.
అయితే ప్రస్తుత సమాజంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అది రోబో( Robos )ల గురించే.ఎందుకంటే మనిషి చేసే పనిని చాలా సులభంగా చకచకా చేసేస్తాయి.
అయితే రోబోలు ఏమైనా చేయగలవు కానీ వంట చేయడం మాత్రం కేవలం మనిషికి మాత్రమే సాధ్యమవుతుంది.
మనిషి మాత్రమే వంటలో ఉండే రుచి ఎలా ఉందో చెప్పగలడు.మరి రోబోలు వంట చేసి రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్పగలుగుతాయా అంటే అవును అని చెప్పవచ్చు.కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కి అనుబంధంగా ఉన్న బయో ఇన్ స్పైర్డ్ ల్యాబొరేటరీ( Bio-Inspired Robotics Laboratory ) కి చెందిన పరిశోధకులు చేసిన పరిశోధన అద్భుత ఫలితాలు సాధించింది.
రోబోలు మనిషి మాదిరిగానే ఆహారాన్ని నమ్ములుతూ రుచిని అంచనా వేస్తాయట.కృత్రిమ మేధా సాయంతో వంట ఎంత రుచిగా ఉందో.ఎలా ఉందో రోబోలు చెప్పేస్తాయి.ఈ సాంకేతికతను బెకో అనే కంపెనీ కేంబ్రిడ్జ్ పరిశోధకులకు అందించింది.
ఇక చెన్నైకి చెందిన ఒక రోబో చెఫ్( Robo Chef ) అనే స్టార్టప్ రోబో ను తయారుచేసింది.ఈ రోబో కూరగాయలు కట్ చేయడం, మసలాలు దంచడం, కూరల్లో ఏ నిష్పత్తిలో ఏవి వేయాలో అలా వేసే విధంగా చెన్నైకి చెందిన ఓ ఇంజనీర్ ప్రోగ్రాం చేశాడు.ఒకేసారి వంద రకాల కూరగాయలను ఉడికించగలదు.ఏకకాలంలో 600 మందికి వంట చేయగలదు.ఈ రోబో ఈ రకాల రెస్టారెంట్లలో పని చేయగలుగుతుంది.త్వరలోనే రోబోలు చేసే వంటను మనుషులంతా రుచి చూడబోతున్నారు.
కానీ రోబోల వల్ల చాలామంది ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.