ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ( Telangana Congress )లో చేరికల జోష్ కనిపిస్తోంది.బీఆర్ఎస్ , బిజెపికి చెందిన కీలక నేతలు కాంగ్రెస్ లో చేరిపోతున్నారనే హడావుడి తెలంగాణ కాంగ్రెస్ లో కనిపిస్తుంది.
మొన్నటి వరకు బీఆర్ఎస్( BRS ) కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బిజెపి ఉన్నా , ఇప్పుడు ఆ స్థానాన్ని కాంగ్రెస్ ఆక్రమించిందనే విధంగా పరిస్థితులు మారడం, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్( MP Dharmapuri Arvind ) ఈ విషయాలపై స్పందించారు.కాంగ్రెస్ లో భారీగా చేరికలు అంటూ జరుగుతున్న ప్రచారం మీడియా సృష్టిని, తెలంగాణ సీఎం కేసీఆర్ పనుగట్టుకుని కాంగ్రెస్ కు హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అరవింద్ అన్నారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) కాంగ్రెస్ లో చేరినా, ఖమ్మం జిల్లాలో మెజార్టీ స్థానాల్లో బిజెపి అభ్యర్థులు గెలుస్తారని , దీనికి మా స్ట్రాటజీ మాకు ఉంది అని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీ ఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని అన్నారు.అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించారు. అమిత్ షా ( Amit Shah )కేటీఆర్ తో సమావేశం అయ్యారని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారు అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ , బిజెపి ఒక్కటే అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీ ఆర్ ఎస్ , బీజేపీ ఎలా ఒక్కటో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని అరవింద్ ప్రశ్నించారు.బీ ఆర్ ఎస్ దూరంగా ఉంటున్నామంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.
కారు పార్టీ స్టీరింగ్ ఇప్పటికీ ఎంఐఎం చేతిలో ఉందని విమర్శించారు .

ఢిల్లీలో అమిత్ షా , జేపీ నడ్డాలను కలిసిన తెలంగాణ బిజెపి నేతలకు ఎలాంటి భ్రమలు పెట్టుకోవద్దని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అరవింధ్ ఘాటుగానే స్పందించారు.తెలంగాణలో బిజెపి తప్పకుండా అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ లను ధీటుగా ఎదుర్కొని తెలంగాణలో బిజెపి జెండా ఎగురవేస్తామని అరవింద్ వ్యాఖ్యానించారు.