భారత్ ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) కు ఆతిథ్యం ఇవ్వనన్న సంగతి తెలిసిందే.అయితే వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఘటనతో క్రికెట్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
వన్డే వరల్డ్ కప్ విజేతకు అందించే వరల్డ్ కప్ ట్రోఫీ ను అంతరిక్షంలో ఆవిష్కరించారు.దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ( ICC ) రిలీజ్ చేసింది.
క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాస్త వినూత్నంగా ఆలోచించి వరల్డ్ కప్ ట్రోఫీ ను అంతరిక్షంలో ( space )లాంచ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.అంతరిక్షంలో ఏకంగా భూమి నుంచి లక్షా 20వేల అడుగుల ఎత్తులో స్ట్రాటో స్పియర్ లో ఈ ట్రోఫీని ప్రవేశపెట్టారు.
తర్వాత ఈ ట్రోఫీ ను అహ్మదాబాద్( Ahmedabad ) లోని నరేంద్ర మోడీ స్టేడియంలో( Narendra Modi Stadium ) ల్యాండ్ చేశారు.
ఈ వరల్డ్ కప్ ట్రోపీ జూన్ 27 నుంచి 100 రోజులపాటు 18 దేశాలలో వరల్డ్ టూర్ కు బయలుదేరనుంది.ముందుగా ట్రోఫీని అంతరిక్షంలో లాంచ్ చేసినప్పటి నుంచి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం లో ల్యాండ్ అయ్యే వరకు మూడు నిమిషాల వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ ట్రోఫీ అంతరిక్షంలో ఉన్నప్పుడు 4k కెమెరాలతో ఫోటోలు, వీడియోలను షూట్ చేశారు.ఇక ఈ ట్రోఫీ టూర్ భారత్ నుంచి ప్రారంభమై కువైట్, బెహ్రాయిన్, మలేషియా, యూఎస్ఏ, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ, శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా దేశాలలో జూన్ 27 నుంచి జూలై 14 వరకు పర్యటించి ఆ తరువాత ఇతర దేశాలలో పర్యటించి సెప్టెంబర్ 4న భారత్ కు చేరుకుంటుంది.ఈ ట్రోఫీ ను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఏకంగా 10 లక్షల మందికి కల్పించనున్నారు.
క్రికెట్ చరిత్రలో ఇలా ఒక ట్రోఫీ అంతరిక్షంలో టూర్ కు వెళ్లడం ఇదే మొదటిసారి కావడం విశేషం.