మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘భోళా శంకర్'( Bhola Shankar ) ఒకటి.గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి రెండు భారీ సక్సెస్ లను అందుకున్న మెగాస్టార్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని తహతహ లాడుతున్నాడు.
అందుకే చేస్తున్న సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టి చేస్తున్నాడు.మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం సినిమా( Vedalam Movie Remake )కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందులో కాస్త నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.చుసిన కథలను రీమేక్ చేస్తే ఏముంటుంది.కొత్త కథలతో సినిమాలు చేయాలని ఫ్యాన్స్ సైతం చిరును రిక్వెస్ట్ చేసారు.అందుకే ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ రావడంతో అంచనాలు అంతగా పెట్టుకోలేదు.
కానీ నిన్న ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేయడంతో సీన్ రివర్స్ అయ్యింది.ముందు నుండి ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని పోయి ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేయడంలో టీజర్ బాగా హెల్ప్ అయ్యింది.
మెహర్ రమేష్( Mehar Ramesh ) చిరును ప్రజెంట్ చేసిన తీరు ఆయన డైలాగ్ స్వాగ్ అందరిని ఆకట్టుకుంది.రీమేక్ ను మెహర్ రమేష్ హ్యాండిల్ చేసిన తీరు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది.
దీంతో మరో హిట్ చిరు ఖాతాలో పడడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా చూడచ్చు అనే టాక్ అయితే వినిపిస్తుంది.ఇక ఈ సినిమాలో చిరు సరసన తమన్నా( Tamannaah ) హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్( Keerthy Suresh ) చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
అలాగే ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.