టీజర్ తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకున్న ‘భోళా శంకర్’!

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో 'భోళా శంకర్'( Bhola Shankar ) ఒకటి.

గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి రెండు భారీ సక్సెస్ లను అందుకున్న మెగాస్టార్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని తహతహ లాడుతున్నాడు.

అందుకే చేస్తున్న సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టి చేస్తున్నాడు.మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

"""/"/ తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం సినిమా( Vedalam Movie Remake )కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందులో కాస్త నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.

చుసిన కథలను రీమేక్ చేస్తే ఏముంటుంది.కొత్త కథలతో సినిమాలు చేయాలని ఫ్యాన్స్ సైతం చిరును రిక్వెస్ట్ చేసారు.

అందుకే ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ రావడంతో అంచనాలు అంతగా పెట్టుకోలేదు.కానీ నిన్న ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేయడంతో సీన్ రివర్స్ అయ్యింది.

ముందు నుండి ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని పోయి ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేయడంలో టీజర్ బాగా హెల్ప్ అయ్యింది.

మెహర్ రమేష్( Mehar Ramesh ) చిరును ప్రజెంట్ చేసిన తీరు ఆయన డైలాగ్ స్వాగ్ అందరిని ఆకట్టుకుంది.

రీమేక్ ను మెహర్ రమేష్ హ్యాండిల్ చేసిన తీరు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది.

"""/"/ దీంతో మరో హిట్ చిరు ఖాతాలో పడడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా చూడచ్చు అనే టాక్ అయితే వినిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో చిరు సరసన తమన్నా( Tamannaah ) హీరోయిన్ గా నటిస్తుండగా.

కీర్తి సురేష్( Keerthy Suresh ) చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

అలాగే ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

రామ్ చరణ్ లోకేష్ కనక రాజ్ కాంబో లో సినిమా వచ్చేది అప్పుడేనా..?