సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని సంగీత దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి వారిలో ఇళయరాజా (Ilayaraja ) ఒకరు.ఇలా సంగీతంలో ఎన్నో పురస్కారాలను అవార్డులను అందుకున్నటువంటి ఇళయరాజా గారు సంగీత స్వరాలు అందించిన పాటలు అంటే ప్రేక్షకులు చెవులు కోసుకుంటారు.
వృత్తిపరమైన జీవితంలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఇళయరాజా కొన్నిసార్లు వివాదాలలో కూడా నిలుస్తూ ఉంటారు.గతంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం విషయంలో ఈయనకు కాస్త వివాదాలు కూడా వచ్చినట్టు తెలుస్తుంది.

ఇకపోతే తాజాగా ఇళయరాజా గురించి ప్రముఖ సింగర్ చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.ఇళయరాజా వద్ద ఉండే సింగర్స్ టీంలో మిన్మిని ( Minmini ) అని ప్లే బ్యాక్ సింగర్ ఉండేవారు.ఈమె ఏఆర్ రెహమాన్( AR Rahman ) సంగీత సారధ్యంలో వచ్చిన రోజా సినిమా( Roja Movie ) లు చిన్ని చిన్ని ఆశ అనే పాట పాడారు.ఈ పాట అప్పట్లో ఎంతో సంచలనమైన విజయాన్ని అందుకుంది.
ఈ పాట ద్వారా ఒక్కసారిగా ఈమె ఎంతో ఫేమస్ అయ్యారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన కెరియర్ అర్ధాంతరంగా ఆగిపోవడానికి తన కెరియర్ నాశనం అవ్వడానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చిన్ని చిన్ని ఆశ పాట( Chinni Chinni Asha Song ) పాడిన తర్వాత ఒక్కసారిగా తనకు గుర్తింపు రావడంతో ఇళయరాజా గారు తనని స్టూడియోకి పిలిపించుకొని నా దగ్గర పని చేస్తూ వేరే సంగీత దర్శకుల దగ్గర పాట ఎందుకు పాడావు అలా పాడటానికి వీలు లేదంటూ నన్ను తిట్టారని తెలిపారు.ఇక తాను ఇళయరాజా గారి దగ్గర పనిచేస్తూ ఉండగా తనకు ఏ ఒక్క అవకాశం ఇవ్వలేదు.అయితే ఈయనకు భయపడి బయట కూడా ఇతర దర్శకులు తనకు అవకాశాలు ఇవ్వకపోవడం వల్లే తాను ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.