భగభగ మండే ఎండలకు కాలం చెల్లింది… వర్షాకాలం( Rainy Season ) ఆగమనం జరిగింది.దాంతో దేశంలో పలుచోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
ఈ క్రమంలోనే గుజరాత్లో( Gujarat ) భారీ వర్షాలు నమోదు అయ్యాయి.ఇక్కడ పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి.
తాజాగా ఖేదా జిల్లాలోని ఓ అండర్పాస్లో( Underpass ) నీళ్లు నిలిచిపోయిన కారణంగా ఓ కాలేజ్ బస్( College Bus ) ఆ వరదల్లో చిక్కుకుంది.చాలా సేపు సాయం కోసం చూసిన విద్యార్థుల్లో కొందరు చొరవజూపి ఎలాగోలా బయటకు వచ్చారు.
ఆ తరువాత వాళ్లే మిగతా విద్యార్థులకు సాయం చేసి ఆ బస్సులోనుండి చాలా చాకచక్యంగా బయటకు తీసుకొచ్చారు.దాంతో అందరూ హమ్మయ్య అంటూ సురక్షితంగా బయటపడ్డారు.
కాగా దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.వైరల్ వీడియోని ఒకసారి గమనిస్తే, ఐదుగురు అబ్బాయిలు బస్ పక్కన ఓ లేన్లో నిలబడి బస్లో ఉన్న వారికి చేయందించడం స్పష్టంగా గమనించవచ్చు.బయటకు రావడానికి అంతకు మించి మార్గం కనిపించలేదని, కింద నీళ్లు నిలిచిపోవడం వల్ల ఇబ్బంది పడ్డామని స్టూడెంట్స్ ఈ సందర్భంగా చెప్పుకురావడం గమనార్హం.విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే సాయం చేయాల్సింది పోయి కొందరు బైకర్స్ ఆ సందులో నుంచే పారిపోవడం మనకు కనిపిస్తుంది.
కాగా దీనిపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏటా గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తాయని గత వారమే IMD వెల్లడించింది.ఇక్కడ దహోద్, చోటా ఉదెపూర్, నర్మదా, పంచ్మహల్, దంగ్, తపి ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోంది.కాగా వానల కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రైతులు ఆనందంలో మునిగిపోతుంటే మరికొన్ని చోట్ల ఇలా ముంపుళ్లవలన జనాలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.
అదేవిధంగా రాజస్థాన్లో కూడా వర్షాలు అధికంగా ఉండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.అంత భారీ వానలోనూ కొందరు తమ డ్యూటీని మాత్రం మర్చిపోవడం లేదు.కాగా కొందరు ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను కరెక్ట్ సమయానికి డెలివరీ చేయడం విశేషం.ఈ వీడియోని కూడా కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు.
ఒక్కసారి లుక్కేయండి ఆ వీడియోలపైన.