బీసీ బందు అమలు చేయాలనీ, సమాజంలో సగం కంటే ఎక్కువగా జనసంఖ్య కలిగిన బీసీలకు లక్ష రూపాయల రుణం కాదు, పది లక్షల మేరకు రుణాలు ఇవ్వాలని తెలంగాణ బిసి జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర చైర్మన్ పెరుగు వెంకటరమణ యాదవ్ డిమాండ్ చేశారు.ఎస్సీలకు ఇస్తున్నటువంటి దళిత బంధు బీసీలకు కూడా ప్రకటించాలని ఆయన కోరారు.
ఈరోజులలో కేవలం లక్ష రూపాయలతో ఏ విధంగా అభివృద్ధి చెందుతారని ప్రశ్నించారు.బీసీలలో కుల వృత్తులు చేసుకునే వారికే రుణాలు అందజేస్తూ ఎలాంటి కుల వృత్తులు లేని బీసీలకు ఎలా సహాయపడతారని పేర్కొన్నారు.
బీసీ కేటగిరి లో గల అందరికీ రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా కుల ధ్రువీకరణ పత్రాలు , ఆదాయ పత్రాలు లేని బీసీలు ఎంతోమంది ఉన్నారని , అవ్వీ పొందేందుకు , రుణాల దరఖాస్తులకు ఇచ్చిన సమయం సరిపోదని , నిర్దేశించిన విధంగా ఆయా కులాల వృత్తిదారులు దరఖాస్తులు సమర్పించేందుకు మరింత సమయం కేటాయించాలని కోరారు.
దరఖాస్తులు సమర్పించిన అందరికీ లక్ష రూపాయలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.