రచ్చకెక్కుతున్న నెల్లూరు రాజకీయం!

గత ఎన్నికలలో అధికార పక్షం క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలలో నెల్లూరు జిల్లా ఒకటి.అక్కడ పది అసెంబ్లీ స్థానాలకు గాను పది స్థానాలు గెలుచుకున్న వైసిపి కి ఈసారి మాత్రం ఆ ఛాన్స్ కనిపించడం లేదు.

 Nellore Old Tdp Leaders Not Happy With New Joined , Nellore , Tdp Leaders , Nar-TeluguStop.com

ఎందుకంటే బలమైన నేతలను క్రమశిక్షణ తప్పారనే కారణాలతో దూరం చేసుకున్న ఆ పార్టీ వచ్చే ఎన్నికలలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందనే అంచనాలు ఉన్నాయి.అయితే ఆ నేతలను కలుపుకోవాలని చూస్తున్న టిడిపిలో కూడా పరిస్థితులు తారుమారవుతున్నాయట .పాత నేతలకు కొత్త నేతలకు మధ్య వివాదాలు రచ్చకెక్కుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి .

Telugu Ap, Chandra Babu, Kotamsridhar, Lokesh, Nellore, Tdp, Ys Jagan-Telugu Pol

వైసీపీ నుంచి బహిష్కరించబడిన ఆనం రామ నారాయణ రెడ్డి ( Anam Ramanarayana Reddy ), నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు ఈ దిశగా చంద్రబాబుని కలిసిన ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశంలో ఇకపై యాక్టివ్గా ఉంటానని , లోకేష్ పాదయాత్ర బాధ్యతలను తన భుజాలకు ఎత్తుకున్నారు జిల్లా వ్యాప్తంగా పట్టున్న ఇలాంటి నేత ముందు ఉండి నడిపిస్తే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశానికి తిరుగుండదని చంద్రబాబు నమ్ముతున్నారు.

Telugu Ap, Chandra Babu, Kotamsridhar, Lokesh, Nellore, Tdp, Ys Jagan-Telugu Pol

అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పాదయాత్రలో లోకేష్ ని కలిసి భవిష్యత్తు కార్యాచరణ చర్చించారు.ఆయన కూడా ఇప్పుడు తన కార్యకర్తలతో లోకేష్ పాదయాత్రలో హడావిడి చేయనున్నారు .ఇదే ఇప్పుడు అక్కడ పాత నేతలకు కోపం తెప్పిస్తుందట.దశాబ్దాలుగా తెలుగు దేశాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తున్న తమకు ఇంకా పార్టీ కండువా కప్పుకోకుండానే హడావిడి చేస్తున్న కొత్త నేతలకు ప్రాముఖ్యత నివ్వడంతో ఏం చేయాలో తెలియక మదన పడుతున్నారని , వర్గపోరుకు తెరతీస్తున్నారని అంటున్నారు.

అయితే గడిచిన రెండు ఎన్నికలలో కూడా అవకాశం ఇచ్చినప్పటికీ కనీసం గా కూడా సీట్లు తేలేకపోయిన పాత నేతలపై చంద్రబాబుకు విశ్వాసం లేదని ,అందుకే కీలకమైన వైసీపీ నేతలని నమ్ముకుని ఆయన రాజకీయం చేస్తున్నారని అంటున్నారు.ఎన్నికలలో విశ్వసనీయతతో పాటు గెలుపు గుర్రాలకే ప్రాముఖ్యత ఉంటుందని కాబట్టి ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకుల కే పెద్ద పీట వేయాలనీ చంద్రబాబు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది మరి పాత నేతల సమస్యల సర్దుబాటు చేసుకోకపోతే మాత్రం నెల్లూరు జిల్లా లో తెలుగుదేశం పార్టీ లో మరో ముసలానికి దారి తీసే అవకాశం కనిపిస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube