జగతికి ఆదర్శంగా పల్లెప్రగతి కార్యక్రమం: ఎమ్మెల్యే సండ్ర

ఖమ్మం జిల్లా

: సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం రెడ్డిగూడెం, మంగాపురం గ్రామాలలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో దశాబ్ది వేడుకల్లో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు సందర్భంగా గ్రామం పండగ వాతావరణం నెలకొంది.గ్రామంలోని ఇంటింటా రంగవల్లులు, ప్రభుత్వ పాఠశాల, గ్రామపంచాయతీ భవనము, పంచాయతీ ట్రాక్టర్, వాటర్ ట్యాంక్, మామిడి తోరణాలతో కొబ్బరాకుల అలంకరణతో పండగ వాతావరణంలో పల్లె ప్రగతి వేడుకలు నిర్వహించారు.

 Rural Development Program As An Example For The World Mla Sandra Details, Distri-TeluguStop.com

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత ట్రైనింగ్ కలెక్టర్ రాధిక గుప్తా పాల్గొనగా గ్రామ ప్రజలు మేళతాళాలతో కోలాటాల నడుమ గ్రామంలోకి ఆహ్వానించి, పల్లె ప్రకృతి వనం, నర్సరీలలో మేల తాళాలతో కలిగి తిరిగి పాఠశాల వద్ద మొక్కలను నాటారు.మన ఊరు మనబడి కార్యక్రమంలో అభివృద్ధి పనులు చేసిన పాఠశాలలో పిల్లలతో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడి నాడు నేడు వసతులు, సౌకర్యాల గురించి పిల్లలతో ముచ్చటించారు.

మంగాపురం గ్రామంలో నూతన గ్రామా పంచాయితీ భావన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు.అనంతరం గ్రామంలో పారిశుధ్య కార్మికులను సన్మానించి, నూతన వస్త్రాలను బహుకరించి పూలాభిషేకం చేసి ప్రశంస పత్రాలను అందజేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సారధ్యంలో అభివృద్ధికి కేరాఫ్ గా తెలంగాణ నిలిచిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube