న్యూయార్క్‌కు అరుదైన గౌరవం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా..

ప్రపంచంలో అతి పెద్ద పట్టణాలు చాలా ఉన్నాయి.ఒక్కొక్క పట్టణం ఒక్కొదానికి పాపులర్.

 New York Is Now The Most Expensive City To Live In The World For Expats Details,-TeluguStop.com

ఒక్కొ పట్టణం ఒక్కొ వినూత్నతను కలిగి ఉంటుంది.ప్రతీ పట్టణంలోనూ పర్యాటక ప్రదేశాలు( Tourist Places ) చాలా ఉంటాయి.

అయితే ప్రపంచంలో కొన్ని పట్టాణాలు అభివృద్ధిలోనూ లేదా ఇతర అంశంలోనూ నెంబర్ వన్‌గా నిలుస్తూ ఉంటాయి.తాజాగా ప్రపంచంలోనే ప్రముఖ నగరంగా పేరున్న న్యూయార్క్( New York ) తాజాగా అరుదైన ఘనతను దక్కించుకుంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా( Most Expensive City ) న్యూయార్క్ నిలిచింది.

Telugu Cost, Geneva, Hong Kong, London, Expensive, York, Singapore-Telugu NRI

తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాను ఈసీఏ ఇంటర్నేషనల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్ 2023ను విడుదల చేసింది.ఈ ర్యాంకింగ్‌లో న్యూయార్క్ తొలి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది.గతంలో అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ నిలవగా.

ఇప్పుడు న్యూయార్క్ స్థానం దక్కించుకుంది.పెరిగిపోతున్న అద్దెలు, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కారణంగా అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ నిలిచింది.

ఇక మూడో స్థానంలో జెనీవా ఉండగా.నాలుగో స్థానంలో లండన్ ఉంది.

Telugu Cost, Geneva, Hong Kong, London, Expensive, York, Singapore-Telugu NRI

సింగపూర్‌ గతంలో 13వ ర్యాంకులో నిలవగా.ఈ సారి ఐదో ర్యాంకును సాధించింది.సింగపూర్‌లో ఇంటి అద్దెలు గణనీయంగా పెరగడంతో టాప్-5 స్థానానికి చేరుకున్నట్లు ఈసీఏ ఇంటర్నేషనల్ ప్రాంతీయ డైరెక్టర్ లీ క్వాన్ తెలిపారు.సింగపూర్‌లో ఇంటి అద్దెలు భారీగా పెరిగిపోయినట్లు తెలిపారు.

కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఇంటి అద్దెలు భారీగా పెరిగిపోయినట్లు తెలిపారు.ఇక ఇస్తాంబుల్ 95వ స్థానం నుంచి 108వ స్థానానికి చేరుకోగా.

దుబాయ్ 12వ ర్యాంకులో ఉంది.రష్యాకు చెందినవారు దుబాయ్‌కు వలస వెళ్తున్నట్లు గుర్తించింది.

ఇక చైనా నగరాలు ర్యాంకింగ్‌లో వెనుకబడగా.యూరోపియన్ దేశాలతో పోల్చుకుంటే ఫ్రెంచి నగరాల్లో ద్రవ్యోల్బణం తక్కువగా నమోదైంది.

ప్రతి ఏడాది ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేస్తూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube