న్యూయార్క్‌కు అరుదైన గౌరవం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా..
TeluguStop.com
ప్రపంచంలో అతి పెద్ద పట్టణాలు చాలా ఉన్నాయి.ఒక్కొక్క పట్టణం ఒక్కొదానికి పాపులర్.
ఒక్కొ పట్టణం ఒక్కొ వినూత్నతను కలిగి ఉంటుంది.ప్రతీ పట్టణంలోనూ పర్యాటక ప్రదేశాలు( Tourist Places ) చాలా ఉంటాయి.
అయితే ప్రపంచంలో కొన్ని పట్టాణాలు అభివృద్ధిలోనూ లేదా ఇతర అంశంలోనూ నెంబర్ వన్‌గా నిలుస్తూ ఉంటాయి.
తాజాగా ప్రపంచంలోనే ప్రముఖ నగరంగా పేరున్న న్యూయార్క్( New York ) తాజాగా అరుదైన ఘనతను దక్కించుకుంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా( Most Expensive City ) న్యూయార్క్ నిలిచింది.
"""/" /
తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాను ఈసీఏ ఇంటర్నేషనల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్ 2023ను విడుదల చేసింది.
ఈ ర్యాంకింగ్‌లో న్యూయార్క్ తొలి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది.గతంలో అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ నిలవగా.
ఇప్పుడు న్యూయార్క్ స్థానం దక్కించుకుంది.పెరిగిపోతున్న అద్దెలు, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కారణంగా అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ నిలిచింది.
ఇక మూడో స్థానంలో జెనీవా ఉండగా.నాలుగో స్థానంలో లండన్ ఉంది.
"""/" /
సింగపూర్ గతంలో 13వ ర్యాంకులో నిలవగా.ఈ సారి ఐదో ర్యాంకును సాధించింది.
సింగపూర్‌లో ఇంటి అద్దెలు గణనీయంగా పెరగడంతో టాప్-5 స్థానానికి చేరుకున్నట్లు ఈసీఏ ఇంటర్నేషనల్ ప్రాంతీయ డైరెక్టర్ లీ క్వాన్ తెలిపారు.
సింగపూర్‌లో ఇంటి అద్దెలు భారీగా పెరిగిపోయినట్లు తెలిపారు.కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఇంటి అద్దెలు భారీగా పెరిగిపోయినట్లు తెలిపారు.
ఇక ఇస్తాంబుల్ 95వ స్థానం నుంచి 108వ స్థానానికి చేరుకోగా.దుబాయ్ 12వ ర్యాంకులో ఉంది.
రష్యాకు చెందినవారు దుబాయ్‌కు వలస వెళ్తున్నట్లు గుర్తించింది.ఇక చైనా నగరాలు ర్యాంకింగ్‌లో వెనుకబడగా.
యూరోపియన్ దేశాలతో పోల్చుకుంటే ఫ్రెంచి నగరాల్లో ద్రవ్యోల్బణం తక్కువగా నమోదైంది.ప్రతి ఏడాది ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేస్తూ ఉంటారు.
బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన టేస్టీ తేజ ఎన్ని లక్షలు సంపాదించారో తెలుసా?