ఇటీవలే కాలంలో చెడు వ్యసనాలకు అలవాటు పడి యువత దారుణంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.చెడు వ్యసనాలకు బానిసైతే జీవితం నాశనం అవుతుంది అనడానికి నిదర్శనమే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి.
( Software Employee ) ఇతని పేరు సందీప్.బాగా చదువుకొని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించి హాయిగా జీవిస్తున్నాడు.
అయితే కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అందుబాటులోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.ఇక సందీప్( Sandeep ) కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఇంటి నుండే ఉద్యోగం చేస్తూ మద్యానికి అలవాటు పడ్డాడు.
ఇక రోజు స్నేహితులతో కలిసి మద్యం తాగేవాడు.వచ్చిన జీతం మద్యానికే సరిపోయేది.
ఇక నెల చివరి వారంలో మద్యం తాగడానికి చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో ఇంటి పక్కన ఉండే ఒంటరి మహిళ బంగారు నగలపై( Gold Jewelry ) కన్నేశాడు.ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం.
వివరాల్లోకెళితే.అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఫాదర్ ఫెర్రర్ కాలనీలో సందీప్ నివసిస్తూ, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేస్తున్నాడు.సందీప్ తన స్నేహితులతో కలిసి మద్యం తాగడం, షికార్లు తిరగడం చేసేవాడు.నెల చివరికి వచ్చేసరికి చిల్లి గవ్వ కూడా చేతిలో ఉండేది కాదు.అయితే ఇంటి పక్కన ఒంటరిగా నివసిస్తున్న రమాదేవి అనే మహిళ దగ్గర ఉండే బంగారంపై సందీప్ కన్నేశాడు.ఈనెల 14న రాత్రి రమాదేవి గాడ నిద్రలో ఉన్నప్పుడు ఆమె దిండు కింద ఉండే తాళం చెవి తీసుకొని బీరువాల్లో ఉండే బంగారు నగలలో 7 తులాల నగలను దొంగిలించి, ఎటువంటి అనుమానం రాకుండా తాళం చెవిని తిరిగి రమాదేవి దిండు కింద పెట్టి వెళ్లిపోయాడు.
మరుసటి రోజు బీరువా తెరిచిన రమాదేవికి కొన్ని నగలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి చుట్టుపక్కల ఉండే వ్యక్తుల వేలిముద్రలు తీసుకొని పరిశీలించగా ఎవరివి సరిపోలేదు.ఇక చివరగా మిగిలింది సందీప్ ఒక్కడే.పోలీసులు సందీప్ ని పిలిస్తే ఏవో కారణాలు చెప్పి తప్పించుకున్నాడు.దీంతో సందీప్ పై అనుమానం వచ్చి, బలవంతంగా పిలిపించి వేలిముద్రలు తీసుకొని పరిశీలించగా మ్యాచ్ అయ్యాయి.దీంతో సందీప్ చేసిన దొంగతనం బయటపడింది.
పోలీసులు సందీప్ ను అదుపులోకి తీసుకున్నారు.