సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan )సైబర్ నేరగాళ్ల ( Cybercriminals )పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు, సైబర్ నేరాలు చేస్తున్నారు.మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మన బ్యాంకు డీటెయిల్ మన పర్సనల్ డీటెయిల్స్ ఎవరికీ చెప్పవద్దు ఎవరితో షేర్ చేసుకోవద్దు, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఫోన్ లేప వద్దు, వారు పెట్టే మెసేజ్ లకు, మెయిల్స్ ఓపెన్ చేయవద్దు, రెస్పాండ్ కావొద్దు,సోషల్ మీడియా లో వచ్చే నకిలీ జాబ్ నోటిఫికేషన్లు నమ్మి మోసపోవద్దు అన్నారు.తక్కువ సమయంలో డబ్బులు సంపాదించవచ్చు అనే ఆశ,నమ్మకంగా స్నేహం చేసి వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతునాయని మన బలహీనతే సైబర్ నేరగాళ్ల బలం అని అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చు అని, ఎవ్వరు ఏమి చేయలేరు అని అన్నారు.
సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 / www.cybercrime.gov.in: పై అవగాహన:ఏదైన సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే బాధితులు సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేసి/www.cybercrime.gov.in లో సమాచారం ఇవ్వాలి కావున ప్రజలకి టోల్ ఫ్రీ నెంబర్ పై అవగాహన కల్పించేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో/పట్టణాలలో,విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని,అంతే కాకుండా జిల్లా పరిధిలో ప్రతి రోజు ఏ రకమైన సైబర్ నేరాలు జరుగుతున్నాయో మళ్ళీ అట్టి నేరాలు పురావృత్తం కాకుండా పత్రిక ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) పరిధిలో ఈ వారం వ్యవధిలో జరిగిన కొన్ని సైబర్ కేసు వివరాలు.
1)ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి సైబర్ నేరస్థుల నుంచి ఫోన్ వచ్చింది.చనిపోయిన బాధితుని తండ్రి పేరు పైన ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందని, క్లేఎం చేసుకోవచ్చని నమ్మించారు.
బాధితునికి ఫోన్ పే లో రిక్వెస్ట్ సెండ్ చేసి దానిని యాక్సెప్ట్ చేయమని చెప్పారు.యాక్సెప్ట్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేయడం వల్ల బాధితుడు 29,000 రూపాయలు నష్టపోయాడు.
2.వేములవాడ( Vemulawada ) టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు టెలిగ్రామ్ లో పార్ట్ టైం జాబ్ ఆడ్ చూసి సైబర్ నెరస్తుడిని సంప్రదించాడు.
మొదట బాధితుడు చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి టాస్క్ కంప్లీట్ చేయడం వల్ల డబుల్ అమౌంట్ వచ్చాయి.ఇది నిజమని నమ్మి బాధితుడు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాడు తర్వాత ఎటువంటి అమౌంటు రాలేదు.తద్వారా 2,57,000 రూపాయలు మోసపోయాడు.3.ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు hdfc క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నెంబర్ ని గూగుల్ లో సెర్చ్ చేసి కాల్ చేశాడు కాల్ కనెక్ట్ అవ్వలేదు.తర్వాత బాధితునికి సైబర్ మోసగాడు కాల్ చేసి క్రెడిట్ కార్డ్ లిమిట్ అండ్ ఎక్స్పైరీ డేట్ తీసుకొని ఓటీపీ షేర్ చేయమని చెప్పగా బాధితుడు ఓటిపి షేర్ చేశాడు.
తర్వాత బాధితుని hdfc క్రెడిట్ కార్డు నుండి 1,76,000/- రూపాయలు డెబిట్ అయ్యాయి.