అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్ కావడం తో ఇది దర్శకుడు సురేందర్ రెడ్డి కెరీర్‌లో మాయని మచ్చగా నిలిచిపోయింది.ఈ నేపధ్యంలో నెక్ట్స్ ప్రాజెక్టు చేసే హీరో ఎవరనేది ఇంట్రస్టింగ్ విషయమే కదా…సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్ మూవీ ప్లాప్ అయిన విషయం తెలిసిందే.
అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ మొదటి షో నుండే నెగెటివ్ టాక్ అందుకుంది.సినీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.
‘ఏజెంట్’రిజల్ట్ … అఖిల్ కు ఎలా ఉన్నా సురేందర్ రెడ్డి ని మాత్రం ఇరకాటంలో పడేసింది.మేకోవర్ అంటూ.
రెండేళ్లపాటు అఖిల్‌ను కష్టపెట్టి.చివరికి జీరో రిజల్ట్ ఇచ్చాడని విమర్శలు వచ్చాయి.
మరో పక్క నిర్మాత అనీల్ సుంకర సైతం.తప్పంతా నాదే.బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా ఏజెంట్ ( Agent )తీశామని ఓపెన్ గా చెప్పేసాడు.బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా ఎలా తీశావని నెటిజన్లు నిర్మాతను ప్రశ్నించినా.ఇన్‌డైరెక్ట్‌గా ఇది దర్శకుడికే తగిలింది.సురేందర్ రెడ్డిదే తప్పంటున్నారు.
దాదాపు 50 పర్సెంట్ రీషూట్ చేసి సినిమా బడ్జెట్‌ను 80 కోట్లకు పెంచేశాడని ఇండస్ట్రీ వాళ్లు వెనకాల మాట్లాడుతున్నారు.సినిమాను డెఫ్‌షీట్‌తో రిలీజ్ చేయగా వరల్డ్ వైడ్ థియేటరికల్ రైట్స్‌ను 36 కోట్లకు అమ్మితే.6 కోట్లు మాత్రమే వచ్చింది.ఇలా ఏజెంట్ హ్యూజ్ డిజాస్టర్ కాగా హీరో దర్శకుడు సురేందర్ రెడ్డి కెరీర్‌లో మాయని మచ్చగా నిలిచిపోయింది.
దాంతో సురేందర్ రెడ్డి కి నెక్ట్స్ ఏ హీరో డేట్స్ ఇస్తాడనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
‘ఏజెంట్’ రిలీజ్ అవడానికి ముందు ఈయనతో సినిమా చేయడానికి ఆసక్తితో ఉన్న అల్లు అర్జున్.ఇప్పుడు ఆలోచన మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.‘ఏజెంట్’ రిలీజ్ తర్వాత కూడా.
అల్లు అర్జున్ కోసం సురేందర్ రెడ్డి కథ మీద కొంత వర్క్ చేసినప్పటికీ వర్కవుట్ కాదని ఆపేసినట్లు తెలుస్తోంది.బన్నీతో సినిమా ఓకే అయ్యే ఛాన్స్ దాదాపుగా లేదని తేలిపోవడంతో అతను వేరే దారి చూసుకుంటున్నట్లు సమాచారం…
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నాని</em( Nani )తో సురేందర్ రెడ్డి కొత్త సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అంటున్నారు.
రీసెంట్ గా నాని దసర సినిమా తో ఒక మంచి హిట్ కొట్టాడు…ఇక సురేందర్ రెడ్డి తో చేసే సినిమాకి కూడా వక్కంతం వంశీ( Vakkantham Vamsi )నే కథ అందిస్తాడా లేదా అన్నది క్లారిటీ లేదు.కానీ నాని, సురేందర్ కాంబో మాత్రం ఓకే అయినట్లు సమాచారం…
.