కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయపుర జిల్లా మనబినళ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను గ్రామస్తులు ధ్వంసం చేశారు.
అనంతరం ఎన్నికల సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేసిన గ్రామస్తులు ఈవీఎంలను లాక్కుని పగులగొట్టారు.
ఎన్నికల సిబ్బంది కారును పల్టీ కొట్టించడంతో పాటు వీవీఎం ప్యాట్ మిషన్లను నుజ్జు నుజ్జు చేశారని సమాచారం.