తన చెత్త రికార్డును తానే బ్రేక్ చేసిన రోహిత్ శర్మ..!

రోహిత్ శర్మ ( Rohit Sharma )అద్భుత రికార్డుల గురించి అందరికీ తెలిసిందే.భారత జట్టు తరఫున ఎన్నో రికార్డులను సృష్టించి ఖాతాలో వేసుకున్నాడు.

 Rohit Sharma Has Broken His Own Worst Record..! Mumbai Indians, Rohit Sharma,sur-TeluguStop.com

ఐపీఎల్ ( IPL ) లో ముంబై జట్టుకు కెప్టెన్ గా ఐదు సార్లు టైటిల్ సాధించాడు.కానీ భారత జట్టుకు కెప్టెన్ అయిన తర్వాత బాధ్యతల ఒత్తిడి వల్ల బ్యాటింగ్లో ఘోరంగా విఫలం అవుతున్నాడు.

Telugu Latest Telugu, Mumbai Indians, Rohit Sharma-Sports News క్రీడ�

ఈ ఐపీఎల్ సీజన్లో చాలా దారుణంగా పేలవ ఆట ప్రదర్శిస్తూ అభిమానులను నిరాశ పరుస్తున్నాడు.బ్యాటింగ్లో రాణించ లేకపోవడానికి ఒత్తిడి కారణం అయ్యుంటుందని క్రికెట్ అభిమానులతో పాటు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.తాజాగా బెంగళూరు ( Bengaluru )జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏడు పరుగులకు అవుట్ అయ్యి తన చెత్త రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు.

రోహిత్ శర్మ కెరీర్ ప్రారంభంలో మిడిల్ ఆర్డర్లో ఆడి అద్భుతంగా పరుగులు చేసేవాడు.2013 నుండి ఓపెనర్ గా ఆడడం ప్రారంభించాడు.అప్పటినుండి వన్డే, టీ20, టెస్ట్ ఫార్మాట్లలో ఎన్నో రికార్డులను సృష్టించాడు.

ఐపీఎల్ లో ఐదు సార్లు ముంబై( Mumbai Indians) జట్టుకు టైటిల్ సాధించి పెట్టిన కెప్టెన్గా తనకంటూ ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేసుకున్నాడు.బ్యాటర్ గా, కెప్టెన్ గా సమర్థవంతంగా రాణిస్తున్న రోహిత్ శర్మ ప్రస్తుతం ఒత్తిడికి లోనై వరుసగా ఘోరంగా విఫలమవుతున్నాడు.

Telugu Latest Telugu, Mumbai Indians, Rohit Sharma-Sports News క్రీడ�

ఇక ఈ ఐపీఎల్ సీజన్లో గత ఐదు మ్యాచ్లలో వరుసగా 2, 3, 0, 0, 7 పరుగులు చేసి అభిమానులను నిరాశపరిచాడు.ఐదుసార్లు సింగిల్ డిజిట్ స్కోరు చేయడం ఇదే మొదటిసారి.అయితే గతంలో 2017లో రోహిత్ శర్మ వరుసగా నాలుగు మ్యాచ్లలో సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యాడు.ఈసారి మరో డిజిట్ పెంచుకొని తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు.

తదుపరి మ్యాచ్లలో ఫామ్ లో రాకపోతే చాంపియన్షిప్ గెలిచే అవకాశాలు కాస్త తక్కువే అని చెప్పాలి.ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar Yadav )ఫామ్ లోకి వచ్చి ఆకాశమే హద్దుగా చెల రేగడంతో తాజా మ్యాచ్లో బెంగళూరు జట్టుపై ముంబై ఘనవిజయం సాధించి లీగ్ పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి దూసుకెళ్లింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube