హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటైన యువ సంఘర్షణ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.నీళ్లు, నిధులు, నియామకాలు కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి తెచ్చుకున్నామని తెలిపారు.
కానీ ఉద్యోగాలు లేక లక్షలాది మంది నిరుద్యోగులు అల్లాడుతున్నారన్నారు.నిరుద్యోగులు తీవ్రమైన మానసిక క్షోభకు గురి అవుతున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం లేకలేక నోటిఫికేషన్ ఇచ్చి పేపర్లు లీక్ చేశారని ఆరోపించారు.ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని తెలిపారు.
తన పాదయాత్రలో అనేక సమస్యలు తెలుసుకున్నట్లు తెలిపారు.ఈ క్రమంలో చేనేతల సమస్యలను ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు.
తెలంగాణను దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.బయ్యారం ఉక్కు, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ రావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని వెల్లడించారు.