3 సినిమాలు లైన్లో పెట్టిన హీరో..!

మ్యాచో స్టార్ గోపీచంద్ లేటెస్ట్ గా రామబాణం( Ramabanam ) అంటూ మరో ప్రయత్నం చేశారు.ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆశించిన టాక్ అయితే రాలేదు.

 Gopichand 3 Movies In Queue,gopichand,director Sriwass,kk Radha Mohan,srinu Vait-TeluguStop.com

రెగ్యులర్ అండ్ రొటీన్ ఫ్యామిలీ అండ్ కమర్షియల్ కథతోనే ఈ సినిమా వచ్చినట్టు తెలుస్తుంది.సినిమాపై గోపీచంద్ చాలా హోప్స్ పెట్టుకోగా అవన్ని మరోసారి నిరాశ పరచాయని చెప్పొచ్చు.

డింపుల్ హయతి( Dimple Hayatthi ) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శ్రీవాస్ డైరెక్ట్ చేశారు.

ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్( Gopichand ) వరుసగా 3 సినిమాలు లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.అందులో ఒకటి కొత్త దర్శకుడు హర్ష చెప్పిన కథను లాక్ చేశాడట.ఈ సినిమాను కెకె రాధామోహన్( KK Radhamohan ) నిర్మిస్తారని తెలుస్తుంది.

ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల( Srinu vaitla ) డైరెక్షన్ లో గోపీచంద్ సినిమా ఉంటుందని టాక్.ఆ తర్వాత తేజ డైరెక్షన్ లో సినిమా కూడా ఉందని తెలుస్తుంది.

ఈ మూడు సినిమాలు త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్.సినిమాలు ఆడకపోయినా సరే గోపీచంద్ వరుస సినిమాలు చేస్తున్నాడు.

మరి రాబోతున్న సినిమాలతో అయినా గోపీచంద్ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube