బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నారు .టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత కెసిఆర్ మరింత దూకుడుగా ముందుకు వెళుతున్నారు .
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో, తెలంగాణతో పాటు, మిగతా రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేసి మరింత ముందుకు తీసుకు వెళ్లే విధంగా, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే ఉద్దేశంతో ఢిల్లీలో( Delhi ) పార్టీ శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు.
జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచి నడిపించే విధంగా ప్లాన్ చేశారు.అలాగే బిజెపి వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటిని ఒకే వేదికపై తీసుకువచ్చే విధంగా ఢిల్లీలో ఎక్కువగా మకాం వేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు బీఆర్ఎస్( BRS ) ఢిల్లీ నూతన కార్యాలయాన్ని మే 4వ తేదీన కెసిఆర్ ప్రారంభించనున్నారు.జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాలన్ని ఇకపై కేంద్ర కార్యాలయం నుంచి నడిపించబోతున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ పార్టీలను ఒకే వేదిక పైకి తీసుకురావడం, సభలు సమావేశాలు అన్నిటికీ పార్టీ కార్యాలయం వేదిక కాబోతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఢిల్లీలోని వసంత్ విహార్( Vasant Vihar ) లో 2021 సెప్టెంబర్ లో కేసీఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఇప్పుడు దానిని ప్రారంభించబోతున్నారు.దీనికోసమే ఈరోజు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు దాదాపు 200 మంది కీలక ప్రజాప్రతినిధులు హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక రేపటి ప్రారంభోత్సవ ఏర్పాట్లు అన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy )ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.పార్టీ ఢిల్లీ కార్యాలయం ప్రారంభమైన తర్వాత కేసిఆర్ ఎక్కువగా అక్కడే మకాం వేసి , వివిధ రాష్ట్రాల్లో పార్టీలో చేరికలతో పాటు, బిజెపికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ను ముందుకు తీసుకువెళ్ళే వ్యూహాలను అమలు చేయబోతున్నారట.