నిజామాబాద్ జిల్లా కారేపల్లిలో దారుణం జరిగింది.వాట్సాప్ గ్రూప్ లో పోస్టు పెట్టాడని ఓ వ్యక్తిని కొందరు యువకులు విచక్షణారహితంగా కొట్టారు.
ఈ ఘటనలో బంతీలాల్ కు తీవ్రగాయాలు అయ్యాయి.ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బంతీలాల్ మృతిచెందాడు.
దీంతె దాడి చేసిన యువకుల ఇంటిపై మృతుని బంధువులు దాడి చేశారు.సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కారేపల్లిలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.