థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో పోలీసుల విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.ఈ వ్యవహారంలో మొత్తం 93మందిని థాయిలాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు.ఈ క్రమంలో మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో పాటు వ్యాపారులు సాగర్, సుదర్శన్ రెడ్డి, భరత్ రెడ్డి, మల్లికార్జున్ రావు, బిల్డర్ మధు, మాధవ రెడ్డి, వర్మ, తిరుమల్ రావు, బొమ్మిడి మధుసూదన్ లు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారని తెలుస్తోంది.
మరోవైపు ఏప్రిల్ లో రెండు సార్లు థాయిలాండ్ లో చికోటీ ప్రవీణ్ గ్యాంబ్లింగ్ నిర్వహించారని సమాచారం.ఈ మేరకు ఏప్రిల్ 11 నుంచి 16 వరకు, మళ్లీ ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకు గ్యాంబ్లింగ్ నిర్వహించారు.
అయితే గోవాకు చెందిన ఓ వ్యక్తి థాయిలాండ్ ఇంటెలిజెన్స్ కు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.