మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కెరీర్ లో చాల మంది హీరోయిన్స్ తో నటించారు.నాలుగు దశకాలుగా 150 కి పైగా సినిమాల్లో నటించిన చిరంజీవి కి మాత్రం కొంతమంది హీరోయిన్స్ అంటే ఇష్టం ఉంటుందట ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని వెల్లడించారు చిరంజీవి ఫేవరెట్ అనే విషయాన్ని తాను రెండు విధాలుగా విభజిస్తానని ప్రొఫెషనలిజం కలిగి ఉన్న హీరోయిన్స్ ఒకవైపు ఉంచితే తనతో ఫ్రెండ్లీగా ఉండే హీరోయిన్స్ మరి కొంతమంది ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు.
అయితే తనను కెరియర్ మొత్తం అమ్మాయి పైగా ఎవరు ఆకర్షించలేదని ప్రేమలో పడటం లాంటివి జరగలేదంటూ కూడా చెప్పుకొచ్చారు.
అత్యంత ఇష్టమైన హీరోయిన్స్ లలో నటనా పరంగా ప్రొఫెషనల్ గా ఉండే హీరోయిన్ కేవలం సౌందర్య ( Soundharya )మాత్రమే అని, ఆమె ప్రవర్తించే విధానం కానీ మాట్లాడే పద్ధతి కానీ నటించే తీరు కానీ అన్నీ కూడా ఎంతో చక్కగా ఉంటాయని ఎంతో ఒదికైనా మనిషి అంటూ సౌందర్య గురించి చిరంజీవి పొగిడారు.ఆమె పక్క ప్రొఫెషనల్ హీరోయిన్ అని ఆమెతో నటించడం చాలా కంఫర్ట్ గా ఉంటుందని ఆమె లాగా నటించే హీరోయిన్ మరొకరు లేరు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె లేని లోటు తీరని అలాంటి హీరోయిన్ మళ్ళీ పుట్టే అవకాశమే లేదంటూ కొనియాడారు చిరు.
తనకు స్నేహితుల విషయానికొస్తే శ్రీదేవి,రాధిక, రాధ( Sridevi, Radhika, Radha ) వంటి నటీమణులతో దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాయని వారితో నిత్యం ఫోన్లో టచ్ లో ఉంటానని ప్రతి ఏడు కూడా 90’s బ్యాచ్ పేరుతో తామంతా కలుస్తూ ఉంటామని ఆ టైంలో ఆటలతో పాటలతో బాగా ఎంజాయ్ చేస్తామని మా కోసం మేము టైం కేటాయించుకుంటాం అంటూ కూడా తెలిపాడు చిరంజీవి.ఇక రాధిక తనను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటుందని, తాను ఆడపిల్లగా అనే విషయం మర్చిపోయి తనతో మగపిల్లాడి లాగానే వ్యవహరిస్తుందంటూ కూడా తెలుపుతున్నాడు.