బాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జాన్వీ కపూర్ నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.
ఈ ముద్దుగుమ్మ అతిలోకసుందరి అయినా శ్రీదేవి ముద్దుల కుమార్తె అన్న విషయం అందరికీ తెలిసిందే.సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ బాగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక తన అందంతో యువతకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా( Social media )లో ఒక పోస్ట్ ని చేయగా అది కాస్త తెగ వైరల్ అవుతోంది.అంతేకాకుండా అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.తాజాగా ఏప్రిల్ 27 న రాత్రి ముంబైలో బాలీవుడ్ 68వ ఫిలింఫేర్ అవార్డ్స్( FilmFare Awards ) కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ అవార్డ్స్ లో మిలీ సినిమాతో జాన్వీ కపూర్ కూడా నామినేషన్స్ లో నిలవడంతో ఈ వేడుకకు హాజరయ్యింది.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె బ్లూ కలర్ డ్రెస్ ను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.కాగా తన డ్రెస్ తనని చాలా ఇబ్బంది పెట్టినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
ఆ డ్రెస్ తో రెడ్ కార్పెట్ పై నడిచే 5 నిమిషాల ముందు జిప్ చిరిగిపోయిందని, ఆ తరువాత స్టేజి పై పెర్ఫామెన్స్ ఇచ్చే 12 నిమిషాల ముందు జిప్ మళ్ళీ చిరిగినట్లు ఆమె తెలిపింది.ఇదే విషయాన్ని సోషల్ మీడియా ఖాతా ద్వారా చెబుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫొటోలో జాన్వి కారులో కూర్చొని ఉంటే టైలర్ వెనుక నుంచి ఆ జిప్ ని కుడుతూ ఉన్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.ఇకపోతే జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.