రాజన్న సిరిసిల్ల జిల్లా: బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తేదీ 25-04-2023 మంగళవారం బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కు రంగులు దిద్దుకొని సిద్దమవుతున్న బిఆర్ ఎస్ పార్టీ గద్దెలు. ఈ సారి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగురవేయడానికి
పార్టీ గద్దెలు లేని చోట కొత్తగా గద్దెలు నిర్మించి ఉన్న చోట గద్దెలపై కొట్టొచ్చినట్టు రంగు రంగులతో బిఆర్ఎస్ పార్టీ పేరుతో కెసిఆర్,కెటిఆర్ ల పేర్ల తో పార్టీ కారు గుర్తు తో అన్ని గ్రామాల్లో ముస్తాబ్ చేస్తున్నారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు ప్రక్కన బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ గద్దె కు రంగులు వేయించి బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం రోజున బిఆర్ ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడానికి సిద్దం చేశారు.