ఇంత స్లోగా ఉంటే భోళా శంకర్‌ అనుకున్న సమయంకి వచ్చేనా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్( Meher Ramesh ) దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేదు.ఇటీవల అలీ రంజాన్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే.

 Chiranjeevi And Mehar Ramesh Movie Bhola Shankar Shooting Update , Mehar Ramesh,-TeluguStop.com

ఆ సందర్భంగా చిరంజీవి భోళా శంకర్ సినిమా షూటింగ్ లోనే ఉన్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే.ఆ మధ్య ఒక మీడియా వ్యక్తి ట్విట్టర్ లో భోళాశంకర్( Bholashankar ) సినిమా ఇంకా 60 రోజుల వర్కింగ్ డేస్ కావాల్సి ఉంది అంటూ ట్వీట్ చేశాడు.

దాంతో సినిమా మరి ఇంత స్లోగా అవుతుంది అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ముందుగా గాడ్ ఫాదర్( godfather ) వాల్తేరు వీరయ్య సినిమాలు వచ్చాయి.

కానీ ఆ రెండు సినిమాలు కంటే ముందు రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభమైంది.కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను ఆలస్యం చేస్తూ వస్తున్నారు.

ఆగస్టు నెలలో విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్స్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.కానీ ఆగస్టు నెలలో సినిమా విడుదల అయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Bhola Shankar, Chiranjeevi, Mehar Ramesh-Movie

సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఇంకా చాలానే ఉంది.అంతే కాకుండా పెద్ద ఎత్తున సినిమా కు సంబంధించిన యాక్షన్స్ సన్నివేశాల చిత్రీకరణ చేయాల్సి ఉంది.మరో వైపు పాటల చిత్రీకరణ కూడా బ్యాలెన్స్ ఉంది.సినిమా ఇంత బ్యాలెన్స్ ఉండగా ఆగస్టు నెలలో విడుదల చేయడం సాధ్యమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.ఏప్రిల్ నెల పూర్తి కాబోతుంది.మే, జూన్, జూలై.

మధ్యలో మూడు నెలలు మాత్రమే ఉన్నాయి.కనుక ఈ మూడు నెలల్లో సినిమాను పూర్తి చేసి దర్శకుడు మెహర్ రమేష్ విడుదలకు సిద్ధం చేయాలని మెగా అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ సంవత్సరం ఆరంభంలో సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ఆ విజయాన్ని కంటిన్యూ చేసే విధంగా భోళా శంకర్ చిత్రం ఉంటుందని మెగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

మరి వారి ధీమా ఎంత వరకు సఫలం అవుతుంది అనేది చూడాలంటే ఆగస్టు వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube