మహిళలకు బంగారం( Gold ) అంటే ఎంత ప్రేమ అన్నది అందరికి తెలిసిందే.వారికి ఎంత బంగారం ఉన్నా సరే కాస్త డబ్బులు రాగానే మళ్లీ ఏదో ఒకటి కొనాలని ఆసక్తి చూపిస్తారు.
అంతేకాదు కావాల్సిన బంగారు నగ కొనలేదు అంటే వారు ఆ ఇంటి యజమాని మీద చూపించే కోప తాపాలు అందరికి తెలుసు.మహిళ(Women )లకు బంగారం మీద అంత మక్కువ ఉంటుంది.
బంగారం ధరించడం వల్ల మహిళలు మరింత అందంగా కనిపిస్తారు.అయితే కేవలం అందంగా కనిపించడం కోసమే కాదు బంగారం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని అధ్యయనాల్లో తెలుస్తుంది.
బంగారం ధరించడం వల్ల రక్త ప్రసరణ( blood circulation ) మెరుగు పడుతుందట.శరీరాన్ని రిలాక్స్ చేయడంలో బంగారం సహకరిస్తుంది. శరీర ఉష్ణోగ్రత( body temperature )ను నియంత్రించడం లో కూడా బంగారం సహకరిస్తుంది.బంగారు ఆభరణాలు ధరించడం వల్ల మానసిక స్థితి కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు.
చర్మం మెరిసేలా చేయడంలో బంగారు భారణాలు ఉపయోగపడతాయి.అయితే ఆయుర్వేదం లో బంగారాన్ని వాడుతారు.
బంగారాన్ని భస్మం చేసి స్వర్ణ భస్మం గా కొన్ని ఔషధాల్లో వాడుతారు.అందుకే బంగారం లో కొన్ని ఔషధ గుణాలు ఉంటాయని తెలుస్తుంది.