అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS ) రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ముఖ్యంగా కేంద్ర అధికార పార్టీ బిజెపి తమను టార్గెట్ చేసుకుని రాబోయే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతుండడం, బిజెపి జాతీయ నేతల నుంచి రాష్ట్ర నాయకులు వరకు అంతా తమనే టార్గెట్ చేసుకోవడం, మరోవైపు కాంగ్రెస్ కూడా దూకుడుగా వ్యవహరిస్తుండడంతో మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించాలంటే వామ పక్ష పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనకు కేసిఆర్ ( KCR )వచ్చారు .
ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు పలికాయి.ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోను అధికారికంగా పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని చూస్తున్నారు .అయితే బిఆర్ఎస్ తో పొత్తుకు లెఫ్ట్ పార్టీలు సముఖంగానే ఉన్నా, సీట్ల విషయంలో డిమాండ్లు వినిపిస్తూ ఉండడంతో అధికారిక పొత్తు ప్రతిపాదన నిలిచిపోయింది.ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం( CPI, CPM )లు ఎక్కడెక్కడ పోటీ చేయాలని విషయంలో నిర్ణయం తీసుకున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రెండు పార్టీలు ఐదు స్థానాలను కోరుతున్నాయి.వీటిలో ఖమ్మం జిల్లా భద్రాచలం, వైరా, కొత్త గూడెం స్థానాలను సిపిఐ కోరుతుండగా , ఖమ్మం , పాలేరు నియోజకవర్గాలను సిపిఎం కోరుతోంది.అయితే ఈ స్థానాల్లో బీఆర్ఎస్ లోను తీవ్రమైన పోటీ ఉంది .ముఖ్యంగా ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నారు.కాంగ్రెస్ నుంచి బీ ఆర్ ఎస్ లో చేరిన కందాళం ఉపేందర్ రెడ్డి తో పాటు, 2018 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరావు( Tummala Nageswarao ) మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.దీంతో ఒకటి రెండు స్థానాలను వామపక్ష పార్టీలకు కేటాయించిబా, రెండు లెఫ్ట్ పార్టీల కార్యదర్శులకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కేసిఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ రెండు పార్టీలు ఆశిస్తున్న స్థానాలపై ఇప్పటికే సర్వే రిపోర్టులు తెప్పించిన కేసీఆర్ ఆ రిపోర్టుల వివరాలను వారికే పంపించి వాస్తవ పరిస్థితులు ఏమిటో చూసుకోవలసిందిగా చెప్పారట.
ఎమ్మెల్సీ ఆఫర్ పై రెండు పార్టీల కార్యదర్శులలో ఒకరు అంగీకారం తెలపగా, మరొకరు తర్వాత దీనిపై తన అభిప్రాయాన్ని చెబుతారని కెసిఆర్ కు రాయబారం పంపారట.సీట్లు పదవులు విషయంలో సరైన క్లారిటీ వచ్చినా, రాకపోయినా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తోనే కలిసి ముందుకు వెళ్లాలని ప్రాథమికంగా లెఫ్ట్ పార్టీలు నేతలు నిర్ణయించుకున్నారట.ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నుంచి సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు , ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నుంచి ఆ పార్టీ మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పోటీ చేయాలని చూస్తున్నారు.
వీరిద్దరి విషయంలో గెలుపు అవకాశాలు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడంతో, సర్వే రిపోర్ట్ ను కెసిఆర్ పంపించారట. ఇక కూనంనేని సాంబశివరావుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారట.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిజెపి వ్యతిరేక పోరు పేరుతో కాంగ్రెస్ వైపు వెళ్లడం కంటే , బిజెపిపై తీవ్రంగా పోరాడుతున్న బీఆర్ఎస్ వైపు వెళ్లడమే మంచిదనే అభిప్రాయంలో లెఫ్ట్ పార్టీ నేతలు ఉండడంతో, పొత్తు దాదాపు ఖరారు అయినట్లే.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.