తెలంగాణలో ఎన్నికలు( Telangana Elections ) దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు గెలుపు కోసం వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి.ముఖ్యంగా అధికార బిఆర్‌ఎస్ పార్టీకి( BRS ) ఈసారి ఎన్నికలు ఎంతో కీలకం.
దాంతో ఎట్టి పరిస్థితీల్లోనూ విజయం సాధిచాలని గట్టి పట్టుదలగా ఉన్నారు గులాబీబాస్.రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన రెండు ఎలక్షన్స్ లోనూ గులాబీ జండా రెపరెపలాడింది.
దాంతో ఈసారి ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని చూస్తున్నారు కేసిఆర్.దానికి తోడు ఈసారి టిఆర్‌ఎస్ ను బిఆర్‌ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు కేసిఆర్.
( KCR ) దాంతో తెలంగాణ గుండె చప్పుడుగా పుట్టిన టిఆర్‌ఎస్ పార్టీ పేరు మార్పును ప్రజలు స్వాగతిస్తారా లేదా అనేది కూడా ఈ ఎన్నికల్లో గెలుపోటములను బట్టి తెలుస్తోంది.
ఇక మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా బలం పెంచుకున్న నేపథ్యంలో ఈసారి బిఆర్‌ఎస్ గెలుపు గత ఎన్నికల్లో మాదిరి ఉంటుందా లేదా ? అనేది కూడా ప్రశ్నార్థకమే.ఇక ఇప్పటికే రెండు సార్లు కేసిఆర్ ప్రభుత్వాన్ని చూసిన తెలంగాణ ప్రజలు ఈసారి అధికార మార్పు వైపు చూసే అవకాశం ఉందనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.ఈ వార్తలన్నిటికి చెక్ పెట్టాలంటే వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తప్పక గెలవాల్సిన పరిస్థితి.
దాంతో ఇప్పటినుంచే అస్త్రశాస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు కేసిఆర్.

గ్రౌండ్ లెవెల్ లో పార్టీ స్థితిగతులపై కేసిఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారట.ఎన్నికలు ఎంతో దూరంలో లేవని ఎమ్మేల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు నిత్యం ప్రజల్లో ఉండాలని సూచిస్తున్న గులాబీబాస్.ప్రజలను ఆకర్శించేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేయాలని భావిస్తున్నారట.
ప్రజల్లో పార్టీపై అభిప్రాయం ఎలా ఉందనే దానిపై ఇప్పటికే సర్వేలు కూడా తెప్పించుకున్నట్లు సమాచారం.

ఇక ఈ నెల 27న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగే సమావేశంలో ప్రధానంగా ఈ అంశాలపైనే చర్చించే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటివరకు అమలౌతున్న పథకాలపై ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది ? ఏమైనా వ్యతిరేకత ఉందా ? ఉంటే వాటిని ఎలా అధిగమిచాలి ? ప్రత్యర్థి పార్టీలను ఎలా కట్టడి చేయాలి ? ఇలా మొత్తం ఎన్నికల లక్ష్యంగా కేసిఆర్ వ్యూహరచనకు సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది.మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మూడవసారి కూడా కేసిఆర్ కే అధికారాన్ని కట్టబెడతారా ? లేదా ప్రత్యామ్నాయం కోసం చూస్తారా ? అనేది వచ్చే ఎన్నికలతో తేలిపోనుంది.