వద్దు అని చెప్పినా వినలేదు.. చివరికి ప్రభాస్ నటించిన ఆ సినిమా ప్లాప్ అయింది?

రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఈశ్వర అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ప్రభాస్.ఇక మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందు కున్నాడు.

 Why Prabhas Did That Flop Movie Even After Knowing , Prabhas , Krishnam Raju ,-TeluguStop.com

ఇక ఆ తర్వాత చేసిన రాఘవేంద్ర యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ప్రభాస్ హీరోగా గోపీచంద్ విలన్ గా నటించిన వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు.టాలీవుడ్ లో అందరి చూపు కూడా ప్రభాస్ వైపు తిరిగేలా చేసింది వర్షం సినిమా.

ఇక ఆ తర్వాత అడవి రాముడు సినిమా తో మరో సారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ప్రభాస్.స్టార్ హీరో రేసులోకి వచ్చేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో ప్రభాస్ ఒక రాంగ్ స్టెప్ వేశాడు అదే చక్రం సినిమా.

Telugu Chakram, Eeswar, Gopichand, Krishnam Raju, Krishnavamshi, Mahesh Babu, Pr

చక్రం సినిమా మంచి కథ.అందరితో నవ్వుతూ ఉండాలి అందరిని నవ్వించాలి అనే కాన్సెప్ట్ ఇందులో సెంటి మెంట్ కూడా అందరికీ మెప్పిస్తూ ఉంటుంది.ఎమోషనల్ సన్నివేశాలలో ప్రభాస్ నటన కూడా ఎంతో బాగుంది.కానీ ఈ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది.కారణం ఈ సినిమా క్లైమాక్స్.ఈ సినిమాలో చివరికి ప్రభాస్ చనిపోతాడు.

ఇక ఇదే కాన్సెప్ట్ తో ఇప్పుడు వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.చివర్లో హీరో విలన్ పై విజయం సాధించడాన్ని అటు ప్రేక్షకులు ఆస్వాదిస్తారు.

ఇక తమ అభిమాన హీరో చివర్లో చనిపోవడం ఉంది అంటే చాలు ప్రేక్షకులు బాగా హర్ట్ అయి పోతూ ఉంటారు.

Telugu Chakram, Eeswar, Gopichand, Krishnam Raju, Krishnavamshi, Mahesh Babu, Pr

ఇక ప్రభాస్ చక్రం సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చక్రం సినిమా అంచనాలను అందు కోలేక డిజాస్టర్ గా  మిగిలి పోయింది.అయితే ముందుగా మెగాస్టార్ ఆ తర్వాత గోపీచంద్ మహేష్ బాబు లాంటి హీరోలకు ఈ కథ వినిపించాడు కృష్ణవంశీ.

వాళ్ళు నో చెప్పడంతో చివరికి ప్రభాస్ దగ్గరికి వెళ్ళాడు.ఇక ప్రభాస్ కి మొహమాటం ఎక్కువ దీంతో ఇక నో చెప్పలేక ఎస్ చెప్పేసాడు.అప్పట్లో ఈ సినిమా వద్దు ఫ్లాప్ అవుతుంది అని ఎంతోమంది సూచించిన ప్రభాస్ మాత్రం ఇక వినలేదట.చివరికి భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం సినిమా ప్రభాస్ కెరీర్లో ఫ్లాప్ గానే మిగిలి పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube