తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా రాఘవ లారెన్స్( Raghava Lawrence ) యొక్క అభిమానులు ఉంటారు అనడంలో సందేహం లేదు.లారెన్స్ కి ఉన్న ప్రతిభ కారణంగా స్టార్ హీరోలు సైతం ఆయన దర్శకత్వం లో పని చేసేందుకు ఒకప్పుడు ఆసక్తి చూపించారు.
మొదట కొరియోగ్రాఫర్ గా రాణించిన లారెన్స్ ఆ తర్వాత నటుడిగా ఆ తర్వాత దర్శకుడిగా కూడా మెప్పించే ప్రయత్నం చేశాడు.నటుడిగా సక్సెస్ ని సొంతం చేసుకున్న రాఘవ లారెన్స్ దర్శకుడిగా పలు సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.
తమిళం( Tamil ) తో పాటు తెలుగు లో కూడా లారెన్స్ యొక్క సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.కానీ గడిచిన నాలుగైదు సంవత్సరాలుగా లారెన్స్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు.
ఆయన సినిమాలు పూర్తిగా తమిళ ఫ్లేవర్ లో ఉంటున్నాయి అంటూ కొందరు ఆరోపిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం తెలుగు లో ఆడే విధంగా లారెన్స్ సినిమాలు ఉండడం లేదు అంటూ విమర్శిస్తున్నారు.
మొత్తానికి తెలుగు మరియు తమిళం లో ఆయన సినిమాలు ఒకప్పటి మాదిరిగా ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.అది ఎప్పటికీ సాధ్యమవుతుంది అంటే ఇప్పట్లో కష్టమే అంటూ కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం రుద్రుడు అనే సినిమా తో లారెన్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
తమిళం లో రూపొందిన ఆ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.ఇటీవల ఆ సినిమా కు సంబంధించిన టీజర్ విడుదలైంది.చూడబోతుంటే తెలుగులో ఆడే పరిస్థితి కనిపించడం లేదు.ఎందుకంటే అలాంటి సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి పైగా ఎప్పటిలాగే తమిళ ఫ్లేవర్ ఎక్కువగా కనిపిస్తుంది.కనుక లారెన్స్ కి ఈసారి కూడా తెలుగు లో నిరాశ తప్పక పోవచ్చు అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు కాకుండా ముందు ముందు అయినా కచ్చితంగా తెలుగులో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటాడని నమ్మకాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.