విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తే ఉద్యోగులు నష్టపోతారని తెలిపారు.
లాభాలను దోస్తులకు అంకితం చేయడమే మోదీ విధానమని పేర్కొన్నారు.
మోదీ, అదానీ వైజాగ్ పొట్ట కొడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
అంతేకాకుండా ప్రజల సంపదను కొల్లగొడుతున్నారన్నారు.ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో కేంద్రం తీరు దుర్మార్గమని పేర్కొన్నారు.
బయార్యంలో నాణ్యత కాదన్న ఆయన మీ పాలనలో నాణ్యత లేదంటూ వ్యాఖ్యనించారు.బైలదిల్లా గనులను దోచుకోకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బైలదిల్లా మైన్ ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.రాజకీయాల కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ టేక్ ఓవర్ అనేది అవాస్తవమని తెలిపారు.