పాస్‌వర్డ్‌లను సులభంగా హ్యాక్ చేస్తున్న ఏఐ.. ఇలా చేస్తే సేఫ్

గత కొన్ని నెలలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) వినియోగం బాగా పెరిగింది.ముఖ్యంగా అందరి నోళ్లలో చాట్ జీపీటీ నానుతోంది.

 Ai Hacking Passwords Easily If You Do This It Is Safe , Ai , Received, Technolog-TeluguStop.com

గూగుల్ సంస్థకు పోటీగా దీనిని చెబుతున్నారు.యూజర్లు వెతికే సమాచారాన్ని అత్యంత ఖచ్చితత్వంతో అందించడం దీని ప్రత్యేకత.

ఇదే కాకుండా పలు సంస్థలు ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి.

Telugu Received, Ups-Latest News - Telugu

అయితే వీటి వల్ల చాలా అనర్ధాలు కూడా ఉన్నాయి.ముఖ్యంగా కోడింగ్ చేసే సామర్థ్యం దీనికి బాగా ఉంటుంది.ఫలితంగా ఎంతో మంది సాఫ్ట్ వేర్ నిపుణుల ఉద్యోగాలు( Software Specialist Jobs ) పోనున్నాయి.

అంతేకాకుండా ఇది చాలా డేంజరస్ అని నిపుణులు పేర్కొంటున్నారు.మనం ఫోన్లకు, యాప్‌లకు, కంప్యూటర్లకు, నెట్ బ్యాంకింగ్ కోసం పెట్టుకునే పాస్ వర్డ్‌లను ఇది సులభంగా చేధిస్తోంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Telugu Received, Ups-Latest News - Telugu

ఇటీవల హోమ్ సెక్యూరిటీ హీరోస్ అనే సంస్థ ఓ అధ్యయనం చేసింది.సాధారణంగా ఉండే పాస్‌వర్డ్‌లలో 51% నిమిషం లోపు ఏఐ క్రాక్( AI Crack ) చేస్తుందని తేలింది.మరికొన్ని పాస్ వర్డ్‌లలో 65% ఒక గంటలోపు, కాస్త పటిష్టంగా ఉండే పాస్ వర్డ్‌లలో 81% వాటిని ఒక నెల కన్నా తక్కువ సమయంలో ఛేదిస్తోందని అర్ధం అయింది.1,56,80,000 పాస్‌వర్డ్‌ల పాస్‌గాన్ అనే ఏఐ పాస్‌వర్డ్ క్రాకర్‌ను ఉపయోగించి చేధించింది.అయితే 18 కంటే ఎక్కువ అక్షరాలతో ఉన్న పాస్‌వర్డ్‌లు సురక్షితంగా ఉంటాయని తేలింది.

ఇలాంటి వాటిని క్రాక్ చేయడానికి ఏఐకి కనీసం 10 నెలలు పడుతుందట.

Telugu Received, Ups-Latest News - Telugu

మొత్తం అక్షరాలు, నంబర్లు ఉన్న పాస్ వర్డ్‌లు సురక్షితం కాదు.కానీ మన పాస్‌వర్డ్‌లో ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, నంబర్లు, సింబల్స్ ఇలా అన్నీ కలిసి 10 అక్షరాలు పైనే ఉంటేనే మన పాస్ వర్డ్ లు సురక్షితంగా ఉంటాయి.అలాంటి వాటిని హ్యాక్ చేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు దాదాపు అసాధ్యం.

ఇలా చేస్తే మన పాస్‌వర్డ్‌లను కనుక్కోవడానికి ఏఐకి కనీసం 10 సంవత్సరాలు పడుతుందని నివేదిక వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube