ఈ నెల 7వ తేదీన థియేటర్లలో విడుదలైన రావణాసుర( Ravanasura _ మూవీ నెగిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ట్విస్టులు బాగానే ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా నెటిజన్లకు ఒకింత భారీ షాక్ ఇచ్చిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమా డిజాస్టర్ కావడానికి 5 తప్పులే కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రావణాసుర సినిమాలో రవితేజ( Ravi teja ) మార్క్ ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు అస్సలు లేవు.రవితేజ లాయర్ గా కనిపించినా కథకు ఆ పాత్ర వల్ల పెద్దగా ఉపయోగం లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది.
రావణాసుర సినిమాలో ఎక్కువ సంఖ్యలో హీరోయిన్లు ఉన్నా ఒక్క హీరోయిన్ పాత్ర కూడా సరిగ్గా లేదు.ఆ పాత్రలకు క్రేజ్ ఉన్న హీరోయిన్లను సైతం ఎంపిక చేయాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి./br>
శృతిమించిన రొమాన్స్ సన్నివేశాలు కూడా ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.క్లైమాక్స్ లో హీరో గురించి పాజిటివ్ గా చెప్పించినా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చని విధంగా కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో ఉండటం గమనార్హం.దర్శకుడు సుధీర్ వర్మ తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాను అద్భుతమైన థ్రిల్లర్ గా ఒకే జానర్ లో తెరకెక్కించాలని భావించి కథ, కథనం విషయంలో తప్పటడుగులు వేస్తున్నారు.
హైపర్ ఆది ( Hyper Aadi )కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉండగా ఈ సినిమాకు మాత్రం ఆయన కామెడీ మైనస్ అయింది.ఈ 5 తప్పులు రావణాసుర సినిమాకు మైనస్ అయ్యాయి.ఈ సినిమాకు కలెక్షన్లు సైతం ఆశాజనకంగా లేవు.
రవితేజ వేగంగా సినిమాలు చేయడం కంటే కథ, కథనం అద్భుతంగా ఉన్న సినిమాలలో నటిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.